జిల్లా కోర్టుకు ఫలం తో పాటు భవన సదుపాయానికి కృషి చేస్తా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, రూరల్ జనవరి 6:( జనం సాక్షి)
జిల్లా కోర్టుకు స్థలం, తోపాటు భవన సముదాయానికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి సభాపతి విచ్చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఆయనను శాలువాలు, పూల బొక్కెలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.తన దృష్టికి వచ్చిన జిల్లా కోర్టుకు సంబంధించిన భూ సమస్య ను పరిష్కరించే దిశగా ప్రస్తుతం నీటిపారుదల శాఖ వినియోగించుకుంటున్న క్యాడ్ స్థలాన్ని కోర్టు అవసరాల కోసం కేటాయించడానికి జిల్లా యంత్రానికి సూచిస్తామని తెలిపారు. బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు జిల్లా కోర్టు సముదాయానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు స్థల పరిశీలన చేపడుతామని ఆయన అన్నారు. జిల్లాను అధిక నిధులను కేటాయించి అభివృద్ధి దిశగా పనిచేస్తానని ఆయన తెలిపారు. జిల్లాలోని రోడ్ల నిర్మాణాలకు గాను 400 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గతంలోనే పర్యాటక అభివృద్ధికి గాను 225 కోట్లు నిధులు మంజూరి చేయడం జరిగిందని, 25 కోట్లతోనే పనులు చేపట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు నా జీవితం మీకు అంకితం.. శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
నా జీవితం మీకు అంకితం.. మీ కష్టసుఖాల్లో నేనుంటా అని సభాపతి తెలిపారు. మీ మన్ననలను పొందుతా.. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తం 6 గ్యారెంటీలను అర్హులైన ప్రజలందరికీ చేరుస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేరుస్తూ సమస్యల పరిష్కార దిశగా అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్తానని ఆయన పేర్కొన్నారు. కోటిపల్లి ప్రాజెక్టులో బోటింగ్ సౌకర్యం కల్పించడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కోటిపల్లి ప్రాజెక్టుకు రోడ్డు సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని ఆయన
తెలిపారు సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, తెలంగాణ బార్ అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ అనంతసేన్ రెడ్డి, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జనార్దన్ రెడ్డి , కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు బసవరాజ్, గోవర్ధన్ రెడ్డి, యాదవ రెడ్డి, సంపూర్ణ ఆనంద్, మాధవరెడ్డి మహమ్మద్ రఫీ లతో పాటు ఇతర న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.