జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రేగా కాంతారావు

పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 23 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకి పినపాక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీకటిని పాలద్రోలి వెలుగునిచ్చే దీపావళి ప్రజలు జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ పండుగ వేడుక ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అన్నారు.చిన్నపిల్లల టపాసులు కాల్చే సమయంలో తల్లి తండ్రులు దగ్గరుండి తగు జాగ్రత్తలు పాటించి టపాసులు కాల్చలని సూచించారు.భగవంతుని అనుగ్రహంతో అందరికీ శుభం చేకూరాలని,సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.