జుంటుపల్లి గ్రామాన్ని సందర్శించిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్.
మృతి చెందిన కాశమ్మ కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం . శుభప్రద్ పటేల్.
యాలాల అక్టోబర్ 21(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి గ్రామాన్ని శుక్రవారం రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ సందర్శించారు. కలుషిత నీరు త్రాగి మృతి చెందిన కాశమ్మ కుటుంబ సభ్యులను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి కుటంబ సభ్యులకు ధైర్యం చెప్పి .కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ గ్రామస్థులకు ధైర్యం చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి వివరాలు తెలుసుకొని మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తా అన్నారు. అటు నీరు కలుషితమైన విషయం తెలుసుకొని శుభప్రద్ పటేల్ వారి టీమ్ సభ్యులతో వెంటనే ఫీల్టర్ నీళ్లను గ్రామంలో ప్రతి ఇంటికి సరఫరా చేయించారు. రెండు రోజుల పాటు గ్రామంలో శుద్ధి నీరు అందజేసిన సందర్భంగా గ్రామస్తులు శుభప్రద్ పటేల్ కు పెద్ద మనస్సుతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు తిప్పమ్మా, రాజు, గ్రామస్థులు మోహన్ రెడ్డి, యూసుఫ్, భీమప్ప, కృష్ణ , నర్సింలు, సంజయ్ కుమార్, శాంతప్ప, శుభప్రద్ యువసేన సభ్యులు భాను, బాలు, విజయ్ చౌష్ భాయ్, నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area