జూన్‌ 25, 1975లో ఇందిర విధించిన ఎమర్జన్సీ డే సందర్భంగా తెలంగాణలో ఎమర్జన్సీ

తెలంగాణ ఉద్యమంపై ప్రభుత్వనిర్బంధాన్ని వ్యతిరేకిద్దాం!
ప్రజలారా!
ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ కాలం ఉంటుందనే నానుడి ఉంది. ఎంత భయానకమైన సంఘటనలు జరిగినా మరుసటి రోజు మరచి పోతారు. ఏమీ జరగనట్టే తమ రోజువానీ జీవితాంలో మునిగిపోతా రు. హైదరాబాదు వరుస బాంబు పేలుళ్ళు అయినా, తెలంగాణ ఉద్యమంపై యుద్ధస్థాయిలో ప్రభుత్వం విరుచుకుపడినా రెండు రోజుల తర్వాత అంతా మామూలే.38 సం|| క్రితం (1975 జూన్‌ 1977 మార్చి) దేశవ్యాప్తంగా ఎమర్జిన్సీ చీకటి పాలక, పౌర, రాజకీయ హక్కులపై దాని ప్రభావం, అధికార దుర్వినియోగం, రాజ్యాంగ విలువల విధ్వంసం గురించి ఈనాటి తరానికి తెలియదు.’ఎమర్జన్సీ పాలన’ అంటే, ఈ నాటి విద్యార్థి యువతరం అదేమిటి అని అమాయకంగా అడిగాని ఆశ్చర్యం లేదు. 38 సం|| క్రితం (1975 జూన్‌ నుండి 1977 మార్చి వరకు) దేశవ్యాపితంగా ఎమర్జన్సీ చీకటి పాలన అమలయ్యింది. పౌర, రాజకీయ హక్కులు హరించవేయబడ్డాయి. అధికార దుర్వినియోగం, రాజ్యాంగ విలువలు, వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి. నిరంకుశ పాలన కొనసాగింది. ఎమర్జన్సీ అమల్లో ఉన్నంత కాలం వాక్‌, సభా స్వా తంత్య్రాలు ఉండవు, సభలు, సమావేశాలు జరుపుకునే అవకాశం ఉండదు. నిరసనలు, ఆందోళనలు చేసే అవకాశం అసలే ఉండ దు. అన్యాయాన్ని, అక్రమాలను ప్రశ్నించే పరిస్థితే ఉండాదు. ప్రభు త్వ విధానాలను, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించే వీలుండదు. ఎమర్జన్సీ అంటే నింకువ పాలన, నియంతృత్వ పాలన. పౌర ప్రజా స్వామిక హక్కుల ఉల్లంఘన. ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వ సం.ఎమర్జన్సీ కాలంలో దేశవ్యాపితంగా దాదాపు అక్షమందికి పైగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను, మన రాష్ట్రంలో విప్లవకా రులను, విప్లవ రచయితలు, పౌరహక్కుల నాయకులను అరెస్టు చేసి జైళ్లలో నిర్భందించారు. బూటకపు ఎన్‌కౌంట్ల పేరుతో ఎంతో మందిని హత్య చేసింది. ప్రభుత్వం. ఈ నిరంకుశ నిబంతృత్వ పాలన వ్యతిరేకిస్తూ, ఎమర్జన్సీ ఎత్తివేతకు, జ్రాస్వామ్య పునరుద్ధ రణకు ప్రతిపక్ష పార్టీలు, మేధావులు ప్రజలు పోరాడారు. ఫలితంగా ఇందిరాగాంధీ ఎమర్జన్సీని ఎత్తివేసింది.ఎమర్జన్సీ పాలన ఇవ్వాళ తెలంగాణ సమాజం, ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర ఆకాంక్ష ఉవ్వెత్తున లేచిన ప్రతి సందర్భంలోనూ, ఉద్య మం తీవ్రరూపం తీసుకున్నప్పుడు ఎంతో తీవ్రంగా అణిచివేస్తూ ఉంది ప్రభుత్వం. ప్రభుత్వం హామీలను ఇవ్వడం, వెనక్కి తీసుకో వడం, తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, మళ్ళీ కొంతకాలం స్థబ్ధతకు గురికావడంతో, విద్యార్థులు, యువత తీవ్ర మానసిక ఒత్తిడికి, నారాశకు గురవ్వడం ఆత్మబలిదానాలకు పాల్పడటం ఒక విషాదం. ఈ విషాదానికి ప్రథమ ముద్దాయి కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలే. ఈ బలిదానాల్నీ ప్రభుత్వం చేస్తున్న సామాజిక, రాజకీయ హత్యలే ఈ బలిదానాలన్నీ అణచివేతలో అంతర్భాగమే.కేంద్ర ప్రభు త్వంపై ఒత్తిడి పెంచడానికి. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను బలంగా వ్యక్తీకరించడానికి నిర్వహించిన మిలియన్‌ మర్చ్‌, సడక్‌బంద్‌, సాగరహారం మొదలైన కార్యక్రమాలు జరిగాయి. వీటిపై ప్రభుత్వం అమలుచేసిన అణచివేత చర్యలు, నిర్బంధం గత ఎమర్జన్సీ రోజులను తలపించాయి.మొన్న జరిగిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యయకారులు, ప్రజలపై లాఠీలను జులిపించారు. టియర్‌గ్యాస్‌ షెల్స్‌ను ఉపయోగించారు. గతంలో రబ్బరు బుల్లెట్స్‌ ఉపయోగించి ఎంతో మందిని గాయపరిచారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొంటే పెన్షన్‌ రద్దు చేస్తామని ఉద్యోగులను బెదిరించారు. రేషన్‌ షాపుల ద్వారా నిత్యవసర వస్తువులను, సరఫరా నిలిపేస్తామని ప్రజలను భయపెట్టారు. అసెంబ్లీ చుట్టూ 3 కిలోమీటర్ల ప్రాంతాన్ని నిషేదిత ప్రాంతంగా ప్రకటించారు. అసెంబ్లీని చేరుకోవడానికి ప్రయత్నించిన ఉస్మా నియా విద్యార్థులను అడ్డుకున్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రాత్రిపూట ఇళ్లఈలోకి చొరబ డి, అరెస్టులు చేసారు. బైండ్‌ఓవర్‌ కేసులు పెట్టారు. గతంలో ఎస్మా చట్టాన్ని ఎన్‌ఎస్‌ఎ చట్టాన్ని అమలు చేసి ముందస్తు అరెస్టులు చేసారు. రాజ్యాంగ పరంగా ఎమర్జెన్సీ ప్రకటించకపోయనా, ఇవ్వాళ తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఉద్యమకారులు ప్రజలు తీవ్ర అణచివేతకు గరవుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఛలో అసెంబ్లీ కార్యక్రమానిన్న చాలా తెలివిగా అడ్డుకున్నాడని కాంగ్రెస్‌ పెద్దలు ప్రశంసించారు. అంటే అణచివేతకు కితాబు యిచ్చారు. ప్రజాస్వామికంగా వ్యవహరించకుండా, ఉద్యమాలతో రాజకీయంగా ప్రజాస్వామి కంగా వ్యవహరించకుండా, ‘శాంతి భద్రత’ల పేరుతో సాయుధ బలగాల సహకారంతో అణచివేస్తున్న వారినే పాలక వర్గాలు కీర్తిస్తున్నాయి. గుజరాత్‌ ముస్లీమ్‌ ఊచకోత కోసిన మోడిని భావి భారతప్రధాని అని ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని మిలిటెంటె ఉద్యమంగా నడపాలని మావోయిస్టులు ప్రకటిస్తే, ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతిస్తే, వారి బూచీని చూపించి వేల సంఖ్యలో పారామిలటరీ బలగాల ను దింపి కార్యక్రమాన్ని విఛ్చిన్నం చేయాలని ప్రయత్నించింది. ప్రభుత్వం గ్రేహౌండ్స్‌ దళాలను ఏర్పా టు చేసి ఉద్యమాలను అణచివేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయం సాధించింది. అలాంటి మోడల్‌ అని& రాష్ట్రాలు పాటిం చాలని మొన్ననే కేంద్ర ప్రభురత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేహౌం డ్స్‌ అంటే చట్టవ్యతిరేక సాయుధ సంస్థ. జవాబుదారా తనం లేని సంస్ధ రహస్యంగా హత్యచేసే పోలాసువ్యవస్థ, తెలంగాణ ఉద్యమా న్ని ప్రజాస్వామ్య చట్టపరిథిలో ప్రభుత్వం అనుమతించకపోతే, రాజకీయంగా, ప్రజాస్వామిక పద్దతిలో పరిష్కరించకపోతే ఉద్యమం మిలిటెంట్‌ రూపం తీసుకుంటుంది. అప్పుడు ఎవరిని తప్పుపట్టాలి? ప్రభుత్వాన్నా? ఉద్యమకారులనా? హింస చెలరేగితే ఎవరిని తప్పుపట్టాలి?అధికారంలో ఉన్న పాలక వర్గాలు మాది సుపరిపా లన, పారదర్శకత గల ప్రభుత్వం అని తమకు తామే కితాబు లిచ్చుకుంటూ, ఆచరణలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ది పేరుతో విధ్వంసం సృష్టిస్తూ, ప్రజల జీవనోపాధిని, జీవించే హక్కును హరించి వేస్తున్నాయి. సెజ్‌లరూపంలో, పరిశ్రమల పేరుతో, కారిడార్‌లరూపంలో థర్మ ల్‌, అణువిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుతో, ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ ద్వారా బొగ్గును వెలికితీస్తూ, ప్రజల విస్తాపనకు, పర్యావరణ వినాశనానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వాలు ఈ విధ్వంసానికి, వినాశనానికి వ్యతిరేకంగా అసంఘటితంగా, సంఘటితంగా పోరాడుతున్న ప్రజలపై ప్రభుత్వాలు అణచివేతను కొససాగిస్తున్నాయి. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఉద్యమకారులను చంపుతున్నాయి ఈ ప్రభుత్వాలు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినా, అన్యాయాన్ని ప్రతి ఘటించినా ప్రతి ఒక్కరికి ప్రతి రోజూ ఎమర్జెన్సీయే. తెలంగాణ ప్రాంతంలో కనబడని నిర్భంధం కొనసాగుతూ ఉంది. అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఈ నిరంకుశ పాలనను అందరం వ్యతిరేకించాలి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల హక్కులను రక్షిం చుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఇతర ప్రాంతాల వారి మద్దతును, దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదుల సంఘీ భావాన్ని కూడగట్టాలి. ప్రజాస్వామికి ఆకాంక్షలపై ఎక్కడ దాడి జరిగినా ప్రతిఘటించాలి.