జేడీయూ అధ్యక్షుడిగా నితీష్‌

1

పాట్నా,ఏప్రిల్‌ 10(జనంసాక్షి):బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ జనతాదళ్‌ (యునైటెడ్‌) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో నితీష్‌ ని ఎన్నుకున్నారు. వరుసగా మూడుసార్లు పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన శరద్‌ యాదవ్‌ పదవీకాలం నేటితో ముగిసింది. శరద్‌ యాదవ్‌ మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలంటే పార్టీ రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది. దానికి శరద్‌ యాదవ్‌ నిరాకరించారు. దీంతో, సీఎం నితీష్‌ కుమార్‌ ను పార్టీ కొత్త అధ్యక్షుడిగా జేడీయు జాతీయ కార్యవర్గం ఎన్నుకున్నది.

పాత జనతాదళ్‌ పార్టీలను ఏకం చేయడం, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలకల్లా దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగడం వంటి లక్ష్యాలు నితీష్‌ ముందున్నాయి.