జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు రైతు ఆత్మ హత్య యజ్ఞం
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 19 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు లోకేష్ అనే రైతు ఆత్మహత్య పాల్గొనగా అక్కడున్న పోలీస్l లు చొరవ తీసుకొని రైతు ప్రాణాలను కాపాడారు.జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం కలుకుంట్ల గ్రామ శివారులో 5 ఎకరాల 20 గుంటల భూమి తన భూమిని వేరే వారి పేరు మీద చేశారని 8 సార్లు కలెక్టర్లకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడగా అక్కడున్న పోలీసులు అధికారులు కాపాడారు.నా భూమిని నాకు తిరిగి ఇవ్వాలని లోకేష్ అనే రైతు చాలాసార్లు మానపాడు తాసిల్దార్లు కు కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందని మానసికంగా విసిగిపోయిన రైతు ఆత్మహత్యమే శరణమని, విషయాన్ని ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ కు తమ సమస్యను తీసుకువచ్చిన ప్రయోజనం లేకుండా పోయిందని, మానసికంగా ఆందోళన చెంది ఆత్మహత్యకు పూనుకున్నట్లు తెలిసింది.
జిల్లాలో ఒక లొకేషన్ కాదు చాలామంది భూములను సంబంధిత తహసిల్దార్ లు ధరణి నెపంతో పట్టాదారుకు కాకుండా వేరే వారికి ఏకంగా వారి పేరు మీద పట్టా బుక్కులు ఇచ్చినట్లు జిల్లాలో ఏ రైతు నోట చూసిన ఇదే మాట వినబడుతుంది, రైతులు తాసిల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో కొంతమంది రైతులు సీసీఎల్ఏ, లోకాయుక్త ఫిర్యాదు చేసిన కూడా జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఫైలు కదడం లేదని జిల్లాలోని లోకేష్ లాంటి రైతులు చాలామంది ఉన్నారని, ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ధరణిలో నిజమైన పట్టాదారులు కాదని వేరే వారికి పట్టా చేసినా అధికారులపై చర్య తీసుకుని నిజమైన పట్టాదారుల న్యాయం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.