జోడో యాత్రకు సంఘీభావంగా పాదయాత్ర
పాల్గొన్న అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క
సెప్టెంబర్ 08 ,బోనకల్ (జనం సాక్షి) :
దేశంలో మతోన్మాదం, విభజన రాజకీయాలు, నిరుద్యోగ సమస్యలు, పెరిగిన నిత్యవసర ధరలు, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం రైతన్నల ఆక్రోశాలు తదితర సమస్యలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయాలని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జోడో యాత్రకు సంఘీభావంగా గురువారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు ఆధ్వర్యంలో చింతకాని మండలం నాగులవంచ నుండి బోనకల్ మండలం ముష్టికుంట్ల వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని పాల్గొనడం జరిగినది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 3,570 కిలోమీటర్లు మేరకు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ప్రారంభించారని,ఈభారత్ జోడో యాత్రలో భాగంగా రోజుకు 23 కిలోమీటర్లు రాహుల్ గాంధీ నడుస్తూ ఆయా రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, వైస్ ఎంపీపీ గూగులోత్ రమేష్, బంధం నాగేశ్వరరావు, ఎర్రం శెట్టి సుబ్బారావు,మారుపల్లి ప్రేమ్ కుమార్, భూక్య బద్రునాయక్,మేకల శరత్, చింతేటి సురేష్, డేగల వేలాద్రి,జట్టెం పుల్లయ్య, దారెల్లి రాకేష్,కొమ్మి నేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.