టీఆర్‌ఎస్‌లో చేరిన మక్తల్ ఎమ్మెల్యే
– అభివృద్ధి కోసమే పార్టీమారా
– చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
హైదరాబాద్,ఏప్రిల్ 13(జనంసాక్షి): పాలమూరు జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. గతకొంతకాలంగా ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం సాగింది. బుధవారం క్యాంపు ఆఫీస్‌లో రామ్మోహన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న రామ్మోహన్‌రెడ్డితో మంత్రి లక్ష్మారెడ్డి మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సోదరుడే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి. కాగా చిట్టెం రాకతో మరింత బలోపేతం అయ్యాం: గువ్వలటిఆర్‌ఎస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని పాలమూరు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి రావడానికి ఆహ్వానిస్తున్నామని అన్నారు. క్యాంపు ఆఫీస్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో రామ్మోహన్‌రెడ్డి చేరిన సందర్భంగా గువ్వల విూడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని చెప్పారు. ఆ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి నేతలు వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసి పాటుపడుతామని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముందుకు పోతామన్నారు. గతంలో జరిగిన వివాదాలను మరిచిపోయి పాలమూరు జిల్లా అభివృద్ధికి పాటు పడుతామని తేల్చిచెప్పారు. గతంలో జిల్లా జడ్పీ సమావేశంలో గువ్వల బాలరాజు, రామ్మోహన్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విదితమే. అయితే ఇవన్నీ గతమని, ఇప్పుడు అభిశీద్దికి పాటుపడడమే తమ ముందున్న లక్ష్యన్నారు. చిట్టెం కూడా అభివృద్ది కాంక్షించి పార్టీలోకి వచ్చారని అన్నారు.