టీఆర్‌ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
– నాయిని నర్సింహారెడ్డి
హైదరాబాద్,ఏప్రిల్ 18(జనంసాక్షి): టీఆర్‌ఎస్ ప్లీనరికి గ్రేటర్ హైదరాబాద్ నుంచి 5 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని ¬ంమంత్రి నాయిని తెలిపారు. సభకు భారీగా జనసవిూకరణ చేస్తున్నామన్నారు. తాము ఎవరిని బలవంతంగా పార్టీలో చేర్చుకోలేదని అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని నాయిని తెలిపారు. ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ ప్లీనరీని నిర్వహిస్తున్నామని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో నాయిని విూడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం ప్లీనరీ సమావేశాలకు హైదరాబాద్ నుంచి 600 మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటికే జిల్లా, మండల కమిటీలు వేశామన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించిందని గుర్తు చేశారు. సీఎం చేస్తున్న అభివృద్ధిని చూసే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని తెలిపారు. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు జానారెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను విమర్శిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. కేంద్రం నుంచి కరువు నిధులు పూర్తి స్థాయిలో రాలేదన్న నాయిని అన్నారు. . కరవు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో దత్తాత్రేయకు ఎలా తెలుస్తుందని, ఆయన ఢిల్లీ, హైదరాబాద్ మధ్య తిరుగుతుంటాడని ఎద్దేవా చేశారు. తాను రాజ్యసభలో రేసులో లేనని స్పష్టం చేశారు. మంత్రి పదవిలో కొనసాగించినంత కాలం ఉంటానని, అధినేత ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధమన్నారు. ఈ నెల 27న ఖమ్మం పట్టణంలో జరగనున్న టీఆర్‌ఎస్ 15న ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆయన విడుదల చేశారు. అదే రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రానున్నారని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్లీనరీలో చర్చిస్తామని వివరించారు. సీఎం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు