ట్యాంక్‌బండ్‌ చుట్టూ వై ఫై…

C

మన హైదరాబాద్‌ టెక్నాలజీ లీడర్‌

డిజిటల్‌ తెలంగాణే సర్కారు లక్ష్యం

ఐటీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలి

అధికారులతో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి):

ట్యాంక్‌బండ్‌ చుట్టూ కల్పిస్తున్న వైఫై సౌకర్యం పైలట్‌ పథకమేనని నగరవ్యాప్తంగా వైఫై సేవలను విస్తరించాలని చూస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం సాయంత్రం నగరంలో ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ఉచిత వైఫై సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దిల్లీ నుంచి వీడియో కాల్‌లో ఈ కార్యక్రమానికి శుభాభినందనలు అందజేసిన కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ హబ్‌ ప్రారంభోత్సవానికి దిల్లీ వచ్చి ఆయనను ఆహ్వానిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. జలహారంలో భాగంగా 80 వేల కి.మీ. మేర పైప్‌లైన్లను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు.

10కి.మీ…. 30 నిమిషాలు

ఈరోజు ప్రారంభించిన ఉచిత వైఫై సర్వీసులో భాగంగా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో 10కి.మీ. పరిధిలో ఈ సేవలు లభిస్తాయి. ఉచితంగా 30 నిమిషాలపాటు ఎవరైనా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. 2 ఎంబీపీఎస్‌ నుంచి 20 ఎంబీపీఎస్‌ వేగంతో వైఫై సేవలు లభిస్తాయని మంత్రి తెలిపారు.

ఐటిలో తెలంగాణ రాష్టాన్న్రి అగ్రగామిగా నిలిపేందుకు ఐటి శాఖ అధికారులు కృషి చేయాలని  కేటీఆర్‌ అన్నారు.     తెలంగాణలోని వ్యాపార అవకాశాలను  తెలియజేసేలా విస్తృతమైన ప్రచారం చేయాలని సూచించారు. గత పది నెలల్లో ఐటి పరిశ్రమల వర్గాలతో మాట్లాడి, వారిలో విశ్వాసం కల్పించడంలో విజయవంతమయ్యామని తారకరామరావు పేర్కోన్నారు..  ఇప్పటికే హైదరాబాద్‌ టెక్నాలజీ లీడర్‌ అని అయితే ప్రస్తుతమున్న 57 వేల కోట్లున్న సాప్ట్‌ వేర్‌ ఏగుమతులను రాబోయే 5 ఏళ్లలో రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఐటి శాఖాధికారులకి సూచించారు. నూతన పరిశ్రమలు, పెట్టుబడులతో పాటు హైదరాబాద్లో ఉన్న ఐటి పరిశ్రమలు విస్తరించేలా సౌకర్యాలు కల్పించాలని….ఇందుకోసం ప్రత్యేకంగా అదికారులకి భాద్యతలప్పగించాలన్నారు. సాప్ట్‌ వేర్‌ రంగంతో పాటు రీసెర్చ్‌  అండ్‌ డెవెలప్‌ మెంట్‌ రంగం పై మరింత శ్రద్ద వహించాలని కోరారు. వీటితోపాటు హర్‌&ఢ వేర్‌ రంగంలో అనేక అవకాశాలున్నాయని, కేంద్రమిచ్చిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం నేపథ్యంలో తెలంగాణను  హర్డ్‌ వేర్‌, ఏలక్టాన్రిక్‌ పరిశ్రమలకి కేంద్రంగా మార్చేలా చూడాలని శాఖాదికారులను కోరారు. ఐటి శాఖ తరపున పరిశోధన మరియు ఇంట్రపెన్యూర్‌ అవకాశాలను పెంచేలా…వారికి సహకరించేలా… జౌత్సహిక పరిశోధనల కోసం టిహబ్‌ ని ప్రారంభించబోతున్నమన్నారు. వీటితోపాటు విద్యార్దులకి, నిరుద్యోగులకి అవకాశాలు కల్పించేలా జెయన్‌ టియు, నాస్కామ్‌ ల మద్య యంవోయు  కుదుర్చుకున్నామని, అయితే టాస్క్‌ ఖచ్చితమైన లక్ష్యాలతో పనిచేయాలన్నారు.  తెలంగాణ ఈ గవర్నెన్స్‌  కార్యక్రమాల్లో ముందున్నదని, ఇక విూద  యం- గవర్నెన్స్‌ వైపు సరికొత్త కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఐటి శాఖ ప్రభావం ప్రతి శాఖ విూద ఉంటుందని, కేవలం తన శాఖ వరకే పరిమితం కాకుండా…ప్రభుత్వం మరియు ప్రజలకి అవసరమైన కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ-పంచాయితీల ఏర్పాటులో ఐటి శాఖ, పంచాయితీరాజ్‌ శాఖతో సమన్వయం చేసుకోవాలని…ఈ పంచాయీతీలతో రాబోయే రోజుల్లో గ్రామాల్లో గుణాత్మక మార్పులు రాబోతున్నాయని, ఈ-పంచాయితీలతో గ్రామాల్లో పౌరసేవలేకాకుండా ఫైనాన్సింగ్‌, బ్యాంకింగ్‌, ఇన్యూరెన్స్‌ సేవలను అదించనున్నట్లు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణను డిజిటల్‌ తెలంగాణ గా మార్చడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో ఉచిత వైపై సౌకర్యాన్ని దశలవారీగా విస్తరిస్తున్నట్లు తెలిపారు.