ట్యునీషియా పార్లమెంట్‌పై దాడి

55A

8 మంది మృతి

ట్యునీషియా, మార్చి18(జనంసాక్షి): ట్యునీషియా దేశంలో సాయుధ దుండగుడు రెచ్చిపోయాడు. పార్లమెంటుపై దాడి చేసి ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పర్యాటకులు, ఒక ట్యునీషియన్‌ చనిపోయారు. మ్యూజియంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు తొలుత మరో 30 మందిని పార్లమెంట్‌ సవిూపంలోని బార్డో మ్యూజియంలో బంధీలుగా ఉంచారు. కొన్నాళ్లుగా ఇస్లామిక్‌ ఉగ్రవాదం ట్యునీషియాలో పెరుగుతోంది. దుండగుడు మిలిటరీ దుస్తుల్లో వచ్చి దాడి చేశాడు. ఈ ఘటనతో ఎంపీలందరినీ పార్లమెంటు నుంచి ఖాళీ చేయించారు. మరోవైపు, బంధీలను విడిపించేందుకు కౌంటర్‌ టెర్రరిజం టీమ్స్‌ రంగంలోకి దిగాయి. ట్యూనిషియా పార్లమెంట్‌ సవిూపంలో జరిగిన దాడి ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. బందీలుగా పట్టుకున్న టూరిస్టులను విడిపించారు. దాంతో రెండు గంటల పాటూ కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ట్యూనిషియా పార్లమెంట్‌ సవిూపంలోని మ్యూజియం విూద జరిగిన ఈ దాడిలో ఎనమిది మంది టూరిస్టులు చనిపోయారు. వారిలో ఏడుగురు వేరే దేశాలకు చెందిన వారే. సైనిక దుస్తుల్లో వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు మరికొందరిని బందీలుగా పట్టుకొని కొంత సేపు బంధించారు. దాంతో రెండు గంటల పాటూ శ్రమించిన పోలీసులు?చివరికి బందీలకు ఎలాంటి హానీ జరుగకుండా వారిని విడిపించారు. ఈ దాడిలో మరణించిన వారికి ట్యూనిషియా ప్రధానితో పాటూ ఫ్రాన్స్‌ ప్రధాని సంతాపం తెలిపారు.