డ్రెయిన్, సీసీ రోడ్ల పరిశీలన
మేడిపల్లి – జనంసాక్షి
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ లో భూగర్భ డ్రైనేజీలు, సీసీ రోడ్లను డిఈ శారద బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట మరమ్మతులు చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో తెరాస సీనియర్ నాయకుడు బొమ్మక్ బాలయ్య, కాలనీ వాసులు తదితరు లు పాల్గొన్నారు.