ఢిల్లీలో కేటీఆర్‌ బిజీబిజీ

5

– కేంద్రమంత్రులతో భేటీ

న్యూఢిల్లీ,మార్చి29(జనంసాక్షి):గ్రావిూణ ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ ని కోరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన ఎంపీలు వినోద్‌, బీబీపాటిల్‌, సీతారాం నాయక్‌, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి లతో కలిసి కేంద్ర ¬ంమంత్రిని, గ్రావిూణ అభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రితో భేటీ అయ్యారు.రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను తక్షణం పెంచాలని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ను మంత్రి కేటీఆర్‌ కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హావిూ మేరకు తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచే అవసరాన్ని రాజ్‌ నాథ్‌ కు కేటీఆర్‌ వివరించారు. రానున్న మూడేళ్లలో సీఎం కేసీఆర్‌ పలు విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ఆలోచిస్తున్నారని.. నియోజకవర్గాల సంఖ్యను తక్షణమే పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచేందుకు ఆలోచిస్తున్నామని.. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే.. డీలిమిటేషన్‌ తోపాటు జిల్లాల పెంపు వంటి చర్యలు త్వరగా చేపట్టేందుకు వీలవుతుందని కేటీఆర్‌ వివరించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9నెలల తర్వాత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కేటాయించారని.. ఇప్పటికే చాలా ఆలస్యమైందని మంత్రి కేటీఆర్‌ రాజ్‌ నాథ్‌ కు వివరించారు. ఇప్పటికీ ఐపీఎస్‌ ల కొరత భారీగా ఉందని? 141 మంది ఐపీఎస్‌ లు అవసరం ఉంటే 29 మంది తక్కువగా ఉన్నారని చెప్పారు. అవసరమైన ఐపీఎస్‌ లను త్వరగా కేటాయించాలని కేంద్ర ¬ం మంత్రిని కోరారు. దీంతోపాటు పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అంశాలన్నింటిని రాజ్‌ నాథ్‌ వద్ద మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించారు.కేంద్ర ¬ంమంత్రితో భేటీ అనంతరం కేటీఆర్‌.. మరో కేంద్రమంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ ను కలుసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో బీటీరోడ్లు వేసినట్లు తప్పుడు నివేదికలు ఇచ్చారని చౌదరికి కేటీఆర్‌ వివరించారు. ఇప్పటికీ చాలా వరకు గ్రావిూణ ప్రాంతాల్లో మట్టిరోడ్లే ఉన్నాయని తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి 3 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ ను కోరారు. రోడ్ల నిర్మాణంలో భాగంగా చాలా చోట్ల బ్రిడ్జిలు ఏర్పాటు చేయాల్సి వస్తోందన్నారు. 172 బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 500 కోట్లు అదనంగా కేటాయించాలని కేటీఆర్‌ కోరారు.మిషన్‌ కాకతీయ పనులను చూడటానికి ఏప్రిల్‌ 20న తెలంగాణ క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి కేటీఆర్‌.. చౌదరి బీరేంద్రసింగ్‌ ను ఆహ్వానించారు. మిషన్‌ భగీరథను చాలా రాష్ట్రాలు ప్రశంసించడంతోపాటు.. అధ్యయనం చేస్తున్నాయని, ఈ సందర్భంగా కేంద్రమంత్రికి కూడా వివరించామని మంత్రి చెప్పారు.కేంద్రమంత్రితో పంచాయతీరాజ్‌ శాఖ అభివృద్ధిపై కూడా చర్చించారు. మౌలిక సదుపాయాల కోసం భారీస్థాయిలో నిధులు ఖర్చుచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో నీటి ఎద్దడి నివారణకు సాయం చేయాల్సిందిగా కోరారు. గ్రావిూణ ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సిందిగా కోరినట్టు చెప్పారు. ఇందుకు తెలంగాణను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. దీంతో, ఒక మోడల్‌ ను తయారుచేసి తీసుకువాల్సిందిగా కేంద్రమంత్రి సూచించారని కేటీఆర్‌ వివరించారు. కరువు బృందం నివేదికలు వచ్చాక సాయం చేస్తామని కేంద్ర మంత్రి హావిూ ఇచ్చారని తెలిపారు.

రోడ్లకు 3వేల కోట్లు ఇవ్వండి

ఆయన కేంద్ర మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్‌తో భేటీ అయ్యారు. కేటీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణకు పీఎంజీఎస్‌వై కింద రూ.3 వేల కోట్ల కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రావిూణ స్థాయిలోని రోడ్లపై అప్పటి ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చిందని వివరించామన్నారు. దీంతో తెలంగాణలోని చాలా గ్రామాల్లో సరైన రోడ్డు మార్గాలులేవని అన్నారు. రోడ్ల అనుసంధానానికి 172 బ్రిడ్జిలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రికి తెలిపామన్నారు. 172 బ్రిడ్జిలకు మరో రూ.5 వందల కోట్లు కేటాయించాలని కోరామన్నారు. ఏప్రిల్‌ 20న తెలంగాణలో క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని కోరామన్నారు. ఈ పర్యటనలో మిషన్‌ భగీరథ పరిశీలించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టాలని గతంలో కేంద్ర మంత్రి కొన్ని సమావేశాల్లో సూచించారని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఇప్పటికే మిషన్‌ భగీరథ పథకాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రశంసించిందని తెలిపారు.