ఢిల్లీలో పెట్రోల్‌, డీిజిల్‌ క్యాబ్‌ల నిషేధం

1

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నుంచి పెట్రోల్‌,డీజిల్‌ క్యాబ్‌లపై సుప్రీం నిషేధం విధించింది. వీటిని గ్యాస్‌ కింద కన్వర్ట్‌ చేసుకోవాలని సూచించింది. ఢిల్లీలో అంతకంతకూ కాలుష్యం పెరిగిపోతుండటంతో అక్కడ డీజిల్‌తో నడిచే క్యాబ్‌లపై సుప్రీం కోర్టు వేటు వేసింది. అలాంటి క్యాబ్‌లు సీఎన్‌జీతో నడిచేలా ఏర్పాటు చేసుకోవాలని లేదంటే వాటిని ఆదివారం నుంచి రోడ్లపై నడిపేందుకు కుదరదని తేల్చి చెప్పింది.కాలుష్య కారక అంశాలపై పలువురి నుంచి దాఖలైన పిటిషన్లపై శనివారం సుప్రీం కోర్టు విస్తృత స్థాయిలో విచారణ చేపట్టింది. దిల్లీలో డీజిల్‌ కార్ల రిజిస్టేష్రన్లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో మహీంద్రా అండ్‌ మహీంద్రా, మెర్సిడస్‌, టొయోటా, జనరల్‌ మోటార్స్‌ తదితర సంస్థలు ఈ పిటిషన్లను దాఖలు చేశాయి. 2,000సీసీ, అంతకంటే ఎక్కువ కెపాసిటీ గల కార్ల రిజిస్టేష్రన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాయి. ఆ పిటిషన్లను  విచారించిన కోర్టు డీజిల్‌ వాహనాల  ఉన్న నిషేధం మే 9 వరకు అలాగే కొనసాగుతుందని చెప్పింది. అలాగే ఆదివారం నుంచి డీజిల్‌ క్యాబ్‌లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై  డీజిల్‌ ట్యాక్సీలు కనిపించవు. కోర్టు ఆదేశాల మేరకు డీజిల్‌ ట్యాక్సీలపై అధికారులు నిషేధం విధించనున్నారు. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్‌ ఇండియా పర్మిట్‌ ఉన్న ట్యాక్సీలకు సీఎన్‌జీ టెక్నాలజీతో మార్చుకోవడానికి అనుమతించింది. మార్కెట్లో సీఎన్‌జీ టెక్నాలజీ సరియైనంతగా అందుబాటులో లేదని, నిషేధం గడువును ఏప్రిల్‌ 30 నుంచి మరికొంత కాలం పొడిగించాలని ట్యాక్సీ ఓనర్ల సంఘం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇప్పటికే కావాల్సినంత సమయం ఇచ్చామని, మరింత గడువు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది.  డెడ్‌ లైన్‌ ఇక పొడిగించడం కుదరదని స్పష్టం చేసింది. మే 1నుంచి సీఎన్జీతో ఉన్న క్యాబులను మాత్రమే అనుమతిస్తామంటూ శనివారం తీర్పులో తెలిపింది. అయితే, ఆల్‌ ఇండియా పర్మిట్‌ ఉన్న వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. దేశంలో ఉన్నత న్యాయ స్థానం ఇచ్చే ఆదేశాలు, మార్గదేశాలు పాటించి తీరాలని సుప్రీం గట్టిగా మందలించింది.