తపాల బీమా తో ధీమాగా ఉండండి
గరిడేపల్లి, అక్టోబర్ 20 (జనం సాక్షి): గరిడేపల్లి పోస్ట్ ఆఫీస్ లో గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ ప్రవేశ పెట్టడం జరిగిందనారు.గురువారం 100 మందికి బీమా పాలసీని ఇవ్వటం జరిగిందన్నారు. పోస్టు మాస్టర్ చందులాల్ ఆధ్వర్యంలో మూడు రోజుల క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోస్ట్ మాస్టర్ చందూలాల్ మాట్లాడుతూ దేశంలో కరోనా మహామారి తర్వాత ప్రజలు ప్రమాద బీమా కోసం చూస్తున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యుల్లోని ప్రతి సభ్యుడికి ప్రమాద బీమా ఉండటం చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఇండియా పోస్ట్ ఆఫీస్ ఇందుకోసం ఒక మంచి ప్లాన్ తో ముందుకు వచ్చిందని కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని పోస్టు మాస్టర్ చందులాల్ కోరినారు . అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు వయసు ఉన్నవారికి ఈ పాలసీ వర్తిస్తుందనారు. ఇట్టి అవకాశాన్ని గరిడేపల్లి మండలంలోని ప్రజలు వినియోగించుకోవాలని పోస్ట్ మాస్టర్ కోరినారు.ఇట్టి కార్యక్రమంలో పోస్టు మాస్టర్ చందూలాల్, బి పీ ఎం లు సైదులు, తిరపయ్య, నరేష్, నాగరాజు ,రాము , ఏ బి పి ఎం లు సంజీవ ఆంజనేయులు,శ్రీను నాయక్, తదితరులు పాల్గొన్నారు.