తమిళనాట మారుతున్న ఎత్తులు, పొడుస్తున్న పొత్తులు

3

చెన్నై,మార్చి22(జనంసాక్షి):తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త పొత్తులు, సవిూకరణలతో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇన్ని రోజులుగా తమవాడేనని ప్రకటించుకున్న కరుణానిధికి షాకిచ్చారు డీఎండీకే చీఫ్‌ విజయ్‌కాంత్‌. వైగో కూటమితో కెప్టెన్‌ చేతులు కలిపి.. కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. విజయ్‌ కాంత్‌తో సమావేశమైన పీడబ్ల్యూఎఫ్‌ నేతలు.. కెప్టెన్‌ను సీఎం అభ్యర్థిగా ఫైనల్‌ చేశారు. దీంతో పాటు సీట్ల పంపిణీపై కూడా ఓ అండర్‌స్టాండ్‌కు వచ్చారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 234స్థానాలకు గానూ.. డీఎండీకే 124 స్థానాల్లో, 110స్థానాల్లో పీడబ్ల్యూఎఫ్‌ పోటీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ పొత్తులు పాత రికార్డులను బ్రేక్‌ చేశాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఆరు కూటములు బరిలోకి దిగడం తమిళనాడు చరిత్రలో తొలిసారని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. విజయ్‌కాంత్‌ నిర్ణయంతో కమల దళం ఒంటరిదైంది. కెప్టెన్‌తో పొత్తు పెట్టుకొని దక్షిణాదిన తమ బలం పెంచుకుందామని భావించిన బీజేపీకి చేదు అనుభవమే ఎదురైంది. తమ కూటమి తరఫున విజయ్‌కాంతే సీఎం అభ్యర్థని ప్రకటించినా? కమలం పువ్వుతో పనిచేసేందుకు కెప్టెన్‌ ఇంట్రెస్ట్‌ చూపలేదు. లోక్‌సభ ఎన్నికల్లో తమ చుట్టూ తిరిగిన పార్టీలతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తూనే ఉన్నా? లోకల్‌ పార్టీలు ససేమిరా అంటున్నాయి.

ఇటు అన్నాడీఎంకే ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగనుంది. 2011 డీఎండీకేతో పొత్తుపెట్టుకొని..ఆ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకోవడంతో ఇరు పార్టీల మధ్య గ్యాప్‌ పెరుగుతూ వచ్చింది. 2014 ఎంపీ ఎన్నికల్లో విజయ్‌కాంత్‌ బీజేపీతో కలసి పోటీచేసి..10శాతం ఓట్లను సంపాదించారు. కాంగ్రెస్‌, డీఎంకే కూటముల మధ్య పొత్తు ఓకే కావడంతో సీట్ల కేటాయింపులపై చర్చిస్తున్నాయి. రామదాసు నేతృత్వంలోని పీఎంకేతో పాటు పలు సామాజిక పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. మరోవైపు సీఎం జయలలిత విజయ్‌కాంత్‌పై సాఫ్ట్‌ కార్నర్‌తో ఉన్నారు. కెప్టెన్‌, ఆయన సతీమణిపై విమర్శలు చేయద్దని పార్టీ క్యాడర్‌కు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఫలితాల తర్వాత కూటములు కొనసాగుతాయనే గ్యారంటీ లేదని చెప్తున్నారు విశ్లేషకులు.

జయలలితతో శరత్‌ కుమార్‌ భేటి

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే డీఎండీకే, పీపుల్స్‌ వెల్ఫేర్‌ ఫ్రంట్‌ మధ్య పొత్తు కన్ఫామ్‌ కాగా? అన్నాడీఎంకే చీఫ్‌ జయలలితతో సమథువా మక్కల్‌ కచ్చి పార్టీ అధినేత, నటుడు శరత్‌ కుమార్‌ భేటీ కావడం ప్రాధాన్యత చోటుచేసుకుంది. పోయిస్‌ గార్డెన్‌ లోని సీఎం నివాసంలో జయలలితతో భేటీ అయిన శరత్‌ కుమార్‌.. అన్నాడీఎంకేతో తమ పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే, గత నెల ఫిబ్రవరిలో అన్నాడీఎంకే కూటమికి గుడ్‌ బై చెప్పిన శరత్‌.. మళ్లీ పొత్తు ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది.