తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యం

విజయనగరం, ఆగస్టు 3 : తల్లిపాలతో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని పెదంకలాం పిహెచ్‌సి వైద్యాధికారి విజయకుమార్‌ చెప్పారు. తల్లిపాల వారోత్సవం, అమ్మకొంగు కార్యక్రమాన్ని మండలంలోని పెదంకలాం, బూర్జ, కృష్ణాపురం తదితర గ్రామల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఏ పుట్టిన బిడ్డకు ఆరునెలల వరకు తల్లిపాలను ఇవ్వాలన్నారు. దీని ద్వారా బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. చంటి పిల్లలకు పాలిచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం అమ్మకొంగు కార్యక్రమంలో పలు గ్రామాల్లో ప్రజలకు అవగాహణ కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు