తాగునీటికి అవస్థలు
విజయనగరం జూన్ 30 : మండలంలోని అక్కివరం గ్రామంలో తాగునీటి సమస్య వేధిస్తోంది. గ్రామంలో నీటి వనరులు ఉన్నప్పటికి తాగేందుకు పనికి రాకపోవడం కిలోమీటరు దూరంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్న బోరుకు వెళ్తున్నారు. గ్రామంలో ఉన్న బోర్లు నీరు ఉప్పుగా ఉండడంతో తాగేందుకు పనికి రావడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. గత కొన్నేళ్ళ నుంచి ఈ సమస్యతో భాద పడుతున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి, గ్రామంలో తాగునీటి ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నారు.