తాడు తెంచేశారు

2

బానిసత్వం నుంచి విముక్తట

తమిళనాట కొత్త ఉద్యమం

చెన్నై,ఏప్రిల్‌14(జనంసాక్షి): తమిళనాడులో పెళ్లికి చిహ్నంగా భావించే తాళిబొట్టును మెడలోంచి తెంచిపారేశారు కొంత మంది వివాహితలు. అసలు తాళెందుకని కొత్త సూత్రాన్ని తెరవిూదకు తెచ్చాయి. మంగళసూత్రం బానిస భావానికి నిదర్శనమని వాదించాయి. హిందూ వివాహితలు ఎందుకు తాళి ధరించాలి? అన్న ప్రశ్న వేస్తే హిందూ వాదులకు, సనాతన వాదులకు ఆగ్రహం వస్తుంది. మన సంప్రదాయాలను మంటగలుపుతావా అని విమర్శిస్తారు. కాని తమిళనాడులో తాజాగా ద్రవిడ కజగం అనే పార్టీ మహిళల మెడలలో తాళి తెంచేసే కార్యక్రమాన్ని చేపట్టడం వివాదాస్పదం అయింది. మహిళల మెడల్లోని మంగళసూత్రాలకు ఎలాంటి మహత్తు లేదని, అవి బానిసత్వానికి చిహ్నాలని, వాటిని తెంపేసి బానిసత్వం నుంచి విముక్తులు కావాలంటూ ఆ పార్టీ ఉద్యమం చేపట్టింది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా జడ్జి దీనిని భావ ప్రకటన స్వేచ్చగా ప్రకటించారు. ఆయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ కు వెళ్లిన అనంతరం.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని 19(2)(3)అధికరణ మేరకు ద్రావిడార్‌ కళగం చేపట్టిన కార్యక్రమాన్ని నిషేధిస్తున్నట్టు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది. నిజానికి భారతీయ సంస్కత్రిలో వివాహ తంతుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మూడు ముళ్లు, ఏడడగులతో ఒక్కటయ్యే జంట జీవితమంతా ఒక్కటిగా బతుకుతామని ప్రమాణం చేస్తారు. వేల సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అటువంటిది తాళి ఎందుకు? అది బానిసత్వానికి సాక్ష్యం.. తెంచేయండి అని ఉద్యమిస్తే మద్ధతు ఇచ్చే ఇల్లాళ్ల  తమిళనాడులో బయలుదేరడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తమిళనాడులో ద్రవిడార్‌ కళగం అనే సంస్థ ఓ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇందుకు హిందూ సంప్రదాయ వాదులు అభ్యంతరం చెప్పారు. కోర్టుకు కూడా వెళ్లారు. మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ పరాంతమమ్‌ తన తీర్పునిస్తూ ఇది భావ ప్రకటనా స్వేచ్చకు భంగకరమంటూ ద్రవిడార్‌ కళగం మంగళవారం తలపెట్టిన తాళి తెంచేసే కార్యక్రమం నిర్వహణకు అనుమతినిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇరవైఐదు మంది వివాహితులు తమ తాళి తెంచేశారు. తాళికి ఉన్న బంగారాన్ని హేతువాద ద్రవిడార్‌ కళగంకు విరాళంగ ఇచ్చేశారు. దీనిపై హిందూ సంప్రదాయవాదులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ప్రభుత్వం ఈ కార్యక్రమంపై సింగిల్‌ జడ్జీ ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేసింది. భారతీయ సంప్రదాయలను ద్రుష్టిలో ఉంచుకుని ఎలాంటి గొడవలకు దారితీయకుండా హైకోర్టు ఇద్దరు సభ్యులుగల బెంచి తీర్పు చెప్పింది.  ద్రావిడార్‌ కళగం చేపట్టిన కార్యక్రమాన్ని నిషేధించింది. తాళి తెంచే కార్యక్రమం అర్థంతరంగా నిలిచిపోయింది. అప్పటికే 25 మంది తాళి తెంచేశారు. ఈ కార్యక్రమంలో తాళి తెంచేసిన ఓ మహిళ మాట్లాడుతూ తాళి తెంచేసిన తరువాత ఎంత హాయిగా ఉంది. ఇంతకాలం దీన్ని అవమానకరంగానే భావిస్తున్నాను, ఇది మెడలో లేకపోతే నాకొచ్చిన బాధేవిూ లేదు అని వ్యాఖ్యానించింది. తమ కార్యక్రమం నిషేధంపై న్యాయ పోరాటం చేస్తామని, విజయం సాధించి ఉద్యమాన్ని ముందుకు తీసికెళతామని ద్రావిడార్‌ కళగం అధ్యక్షుడు కె. వీరమణి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం నిర్వహించాలనుకున్న గో మాంసాహార విందు కార్యక్రమాన్ని కోర్టు తీర్పు మేరకు ద్రావిడార్‌ కళగం విరమించుకుంది. మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్టాల్లో గో వధ నిషేధ చట్టానికి వ్యతిరేకంగా ద్రావిడార్‌ కళగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంది. తమిళనాడు ప్రముఖ నాయకుడు, సుప్రసిద్ధ హేతువాది పెరియార్‌ రామస్వామినాయకర్‌ స్ఫూర్తితో ద్రావిడార్‌ కళగం ఇటువంటి కార్యక్రమాలను చేపడుతోంది.