తుంటినొప్పికి పంటి మందు వేస్తే ఎలా?

తుంటి నొప్పికి పంటి మందు వేస్తే తగ్గుతుందా? తగ్గదని మెడ మీద తలకాయ ఉన్న వాడెవరైనా అంటాడు. కాని మన పాలకుల తలకాయలెక్కడో ఉన్నాయి. మావోయిస్టుల సమస్య ప్రధానంగా సామాజికార్థిక సమస్య. ఆ సమస్యకు పాలకుల పరిష్కారం సిఆర్‌పి ఎఫ్‌, సల్వాజుడుం తుపాకి గుండ్ల వర్షం, వందల మంది ఆదివా సుల మరణాలు, వేలాది మంది నిర్వాసితులు కావటం. అందుకనే 1967 నుంచి సమస్య సమస్యగానే ఉండిపోయింది. ఫలితం, ఇటీవల ఒక కాంగ్రెస్‌ నాయకునితో సహా ఇరవై తొమ్మిది మంది మరణం. ఇంతకు మంఉందు సంవత్సరంలో 74 మంది సెక్కురిటి జవాన్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అపుడే సోనియా గాంధీ, ప్రదాని మన్మోహన్‌సింగ్‌ ఎక్కడున్నారు? మావోయిస్టులను టెర్రరిస్టులని ముద్ర వేయడం తప్ప చేసిందేమీ లేదు. కాని ఇప్పుడు ఇరవై తొమ్మిది మంది కాంగ్రెస్‌ నాయకులు, అనుయాయులు మరణిస్తే అటు సోనియా, ఇటు ప్రధాని ఆఘమేఘాల మీద లగెత్తుకు వచ్చారు. 74 మంది జవాన్లు చనిపోయినపుడు ఈ నాయ కులు రాకపోవడానికి జవాన్ల జీవితాలు అంత చవకా? ఆ కాంగ్రెస్‌ నాయకునికి సెక్యూరిటి బలగాల దన్ను ఇవ్వకపోవడంలో రమణ సింగ్‌ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందట. అసలు సెక్యూరిటి కోరారా? సోనియా అగ్గి మీద గుగ్గిలమై విరుచుక పడిపోయిందని హిందూ పత్రిక వార్తా, కాంగ్రెస్‌ నాయకులు ప్రచారానికి వెళ్లినప్పుడల్లా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెక్యూరిటి బలగాలను తోడుపంపాలా? పోలీసు మాన్యువల్‌లో ఎక్కడా లేదే? అయినా, ఇది శాంతిభద్రతల సమస్య, ఇది హోంశాఖ మంత్రి, ప్రధాని బాధ్యతలకు సంబంధిం చిన వ్యవహారం. పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరంలో వవామప క్షాలు బహిరంగ సభ ఏర్పాటు చేస్తే వేలమంది పోలీసుల బలగాల ను సమీకరించారు.అలాగే కాంగ్రెస్‌ సమావేశాలకుకూడా సెక్యూ రిటీ కోసం వేలమందిని సమీకరించాలని పోలీస్‌ మాన్యువల్‌న సవరిస్తే ఏ స్ధాయి నాయకులకు ఎంతమందిని పంపవచ్చునో కూడా ఆ మాన్యువల్‌లో పొందుపరిస్తే, వాళ్లు మామూలు తుపాకులు, లాఠీలు, బాష్పవాయు ప్రయోగాలు, ఎకె 47లు ఏ మోతాదులో తీసుకొని వెళ్లాలో ఆయా మాన్యువల్‌లో పొందుపరి స్తే, ప్రభుత్వోద్యుగులు అలాగే చేస్తారు. చత్తీస్‌గడ్‌లో ఉన్నది బిజెపి ప్రభుత్వం కాబట్టి, నాలుగు రాళ్లు విసిరే అవకాశాన్ని దొరకపుచ్చు కోవడం, అందులోనూ ఇలాంటి విషయంలో ఆమె విరుచుకపడడం చాలా చీప్‌గా అనిపిస్తుంది. దేశంలో లక్షల మంది రైతాంగం వేరు గతిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సునామీలు, తుఫాన్లు, వర్షాభావ పరిస్థితులు, 40-50 డిగ్రీల వేడిలో వందలాది మంంది చనిపోయారు. పోనియా స్పందించలేదేమిటి? చత్తీస్‌గడ్‌లో ఉన్నది బిజెపి ప్రభుత్వం. అయినా మావోయిస్టుల విషయంలో ఇద్దరూ ఒకే తాటి మీద నడుస్తున్నారు. అలాంటప్పుడు ఈ కత్తులు నూరుకో వడమేమిటి? ఈ పరిణామం చూసి మావోయిస్టులు లోలోన సంతోషిస్తుంటాడు. సోనియాగాంధీ కాంగ్రెస్‌ నాయకులు తప్పో ప్పులు ఎన్ని చేసినా బారా ఖూన్‌ మాప్‌ అనవచ్చు. కాని చత్తీస్‌ గడ్‌లో మావోయిస్టులకు బలి అయిన కాంగ్రెస్‌ నాయకుడు ఎలాంటివాడు? సల్వాజుడుం అనే అనధికార ప్రైవేట్‌ సైనిక దళాన్ని ఏర్పాటు చేశాడు. క్రూరమైన హత్యలు, స్త్రీలపై విచ్చలవిడి అత్యాచారాలు, గ్రామాలను తగలబెట్టడం వంటి కార్యకర్తలు కొనసాగాయి. రెండు మూడేళ్లలోనే దాదాపు 644 గిరిజన గ్రామా లు ఖాళీ అయ్యాయి. అంటే వాటిని తగులబెట్టడం లేదా ప్రజలను అక్కడ నుంచి తరలించడం జరిగిందన్న నివేదికలు వెలువడ్డాయి. దాదాపు మూడు లక్షల మంది జనం వారి గ్రామాలను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వీరితో లక్ష మంది వరకూ సల్వాజుడుం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉండిపోయారు. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను క్యాంపులుగా, తమ స్థావరాలుగా మార్చడంతో పిల్లలకు కొన్నేళ్లపాటు చదువు దూరమైంది. ఇలాంటి నరరూప రాక్షసుడి చావుకేనా సోనియాగాంధీ నోరు పారేసుకుంది. ఈ సంఘటనలో ప్రాథమికంగా ప్రముఖంగా ఏ విషయం చుట్టు సరిభ్రమించాలో, ఆ విషయాన్ని అప్రావ ుుఖ్యంగా పత్రికల్లో చోటు చేసుకొన్న విషయం భూమి, పరిశ్రమమలు, నీటి ప్రాజెక్టులు, గృహ నిర్మాణం ఇలా ఏ అభివృద్ది కార్యక్రమానికైనా కావాల్సింది భూమి. భాక్రానంగల్‌ ప్రాజెక్టు నాటి నుంచి ఈ సమస్యను అపరిష్కృతంగా వదిలిపెట్టేశారు. పాలకులు మావోయిస్టు కార్యకలాపాలు ఈ సమ స్యల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. అటవీ భూమి అంతా చెట్లతో పాటు ఖనిజ సంపదల కాణాచి. ఈ భూమే కొన్ని వేల కోట్ల మంది ఆదివాసుల జీవనాధారం. వారు నివసిస్తున్న అటవీ భూముల్లో అపారమైన ఖనిజ సంపద ఉన్నదని వారికి తెలియదు. కేంద్ర, రాష్ట్ర గనుల శాఖలు ఈ సంపదను కనుక్కోవడంతో ఆదివాసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ సంపద అంతా దేశాభివృద్దికి అత్యవసరం. దేశంలోని ఇనుప ఖనిజంలో 19 శాతం బొగ్గు, బాక్సైట్‌, సున్నపురాయి 11 శాతం ఒక్క చత్తీస్‌గడ్‌లోనే లభిస్తున్నా యి. సహజంగానే పారిశ్రామికవేత్తల కళ్లు ఈ నిధుల మీద పడ్డా యి. అటవీ శాఖ ఈ నిధుల త్వకాన్ని నిషేధించింది. కాని తర్వాత కేంద్రం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ ఖనిజ సంపద దేశావసరాలకు అవసరమైనదని ప్రభుత్వం భావించింది. అయితే ఈ ఖనిజాల తవ్వకం ప్రారంభిస్తే, ఆ అడవుల్లో అనాదిగా నివసించే ఆదిమ వాసులేమవ్వాలి. చట్టం ప్రకారం అలా ఖాళీ చేయించిన వారికి ప్రత్యేక నివాస గృహాలు నిర్మించి ఇవ్వాలి. ఉదాహరణకు, చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలోని బస్తర్‌లో దాతుగడ్‌లోనే ఇరవై వేల ఎరాల విస్తీర్ణంలో గనులున్నాయి. కాగా ఆ భూమి మీద ఆధారపడ్డ ఆదివాసులేం కావాలి? వాళ్లను ఖాళీ చేయించాలంటే ఆయా గ్రామాల పంచాయితీలు తీర్మానాలు చేయాలని చట్టాలు న్నాయి. కాని ఆచరణలో చట్టాలు పారిశ్రామికవేత్ల చుట్టాలయిన తర్వాత ఈ పారిశ్రామికవేత్తల చేతుల్లో ప్రభుత్వం చుట్టం అయిన తర్వాత ఆదివాసుల మొరలాలకించే వారెవరు?పంచాయితీల పేరు ను నగర పంచాయితీలుగా మార్చారు. పంచాయితీల అధికారాలు చెత్తబుట్టలోకి వెళ్లిపోయాయి. చట్టం ప్రకారం ఈ భూములను కౌలుకివ్వవచ్చునే గాని, స్వాధీనం చేసుకోకూడదు. ఆ కౌలుకివ్వడం కూడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ప్రైవేట్‌ రంగానికి పగ్గాలు వేసే నాథుడే లేడు, ప్రైవేట్‌ రంగానికి అవకాశం ఇచ్చిన తర్వాత ఆ రంగంలో పెట్టే పరిశ్రమల అవసరాల కోసమే వినియోగిం చాలి.కాని ఆచరణలో ఆ ఖనిజాలను అమ్మి సొమ్ము చేసుకొండి ప్రైవేట్‌ రంగం అటవీ ప్రాంతంలో ఆదిమ వాసులకే భూమిపై స్వంత హక్కు ఉంది. ఆదివాసేతరులకు ఆ హక్కు లేదు. కాని ఆచరణలో జరిగినదేమంటే ఈ ఆదివాసేతరులు స్త్రీలన లాంఛనం గా వివాహమాడి ఆ నిబంధన నుంచి తప్పించుకుని స్వంతదా రులయ్యారు. కాగితం మీద మాత్రం ఆదివాసుని పేరు ఉంటుంది. వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చుంటేనేమి. ఈ అడవుల్లో ఉన్న బొగ్గు గనుల మీద ప్రైవేట్‌ రంగం కన్నుపడింది. దేశంలో బొగ్గు కొరత ఉన్న విషయం తెలిసిందే. ఆ గనులు తవ్వడానికి కార్పోరేట్‌ సంస్థలు, బహుళజాతి సంస్థలు లైసెన్సుల వేట ప్రారంభించాయి. బహుళజాతి సంస్థలు నేరుగా లైసెన్పులు సంపాదించడంలో ఇబ్బందులుంటాయి. కాబట్టి దేశీయ కార్పొరేట్‌ సంస్ధలతో చెయ్యి కలిపి, ఈ అడవుల్లో ప్రవేశించాయి. ఉదాహరణకు, టాటా కంపెనీ ఒక బహుళజాతి సంస్థతో జతకూడి కోరస్‌ అనే బోర్డు తగిలించుకుంది. హోవ్సిమ్‌ ఒక స్విస్‌ బహుళజాతి సంస్థ, స్పేయిన్‌, అమెరికాలో ఉన్నసిమెంట్‌ సంస్థలన అమ్మేసి మన దేశంలోని ఎసిసి, అంబుజాసిమెంట్‌ కంపెనీలను కొనేసి దేశంలోని సిమెంట్‌ ఉత్పత్తిలో13 శాతంపై పట్టు సాధించింది. చత్తీస్‌గడ్‌లోని రాయ్‌గడ్‌ ప్రాంతంలో ఎక్కడ చూసినా జిందాల్‌ సంస్థ బోర్డులే. 26 ఎకరాల వవ్యవవసాయ భూములన్నీ జింఆల్‌వే. ఈ కంపెనీలతో ప్రభుత్వం ప్రేమలో పడింది. ఇలాంటి పరిశ్రమలు కొన్ని ప్రభుత్వ అనుమతులు పొందాలి. కాని ఆచరణలో అనుమతులు సంపాదించకుండానే ఆ భూమిలో ప్రవేశించవచ్చు. అనుమతులు తర్వాత తెచ్చుకోవచ్చు అని ప్రభుత్వమే మినహాయింపు ఇచ్చిందంటే ఆ రైతులు తమ గోడును ఎవరికి వినిపించాలి? ఇలా అనేక పెద్ద, చిన్న పరిశ్రమలకు అడవులు వారి జాగీరైపోయాయి. ఎక్కడైనా ఏ కంపెనీ అయినా హద్దు మీరితే బాదాఖూన్‌ మాఫ్‌ అంటుంది. చత్తీస్‌గడ్‌లోనే 70 విద్యుదుత్పత్తి కర్మాగారాలు 60 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. ఇన్ని కేంద్రాల స్థాపనకు ప్రభుత్వం వద్ద నిధులేవి? ఈ కేంద్రాలన్ని ప్రైవేట్‌ రంగం చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇనుప ఖనిజం తవ్వడానికి టాటా కంపెనీ, ఎస్సార్‌ కంపెనీతో ఒప్పందాలు చేసుకొంది ప్రభుత్వం.ఈ నేపధ్యంలో అంటే కార్పొరేట్‌, బహుళజాతి సంస్థలు ఖనిజాలున్న భూమిని తమ సొంత జాగీర్లుగా మార్చుకొని వేలమంది ఆదిమవాసులను వారి భూముల నుంచి తొలగిస్తుంటే వారి హక్కులను రక్షించడానికి, వారికి తోడునీడగా నిలవడానికి మావోయిస్టులు నడుం బిగించారు. రెండోవైపు కార్పోరేట్‌, బహుళజాతి సంస్థల హక్కుల రక్షణకు ప్రభుత్వం సమాయత్తం కావడంతో ఉద్యమ జ్వాలలు రగులుకొన్నాయి. ప్రజా యుద్దం ఎంత బలీయంగా తయారైందంటే ఒక సందర్భంలో సైనిక బలగాలను ఈ రాష్ట్రానికి పంపడానికి ప్రయత్నించింది. కాని సైనికాధికారులు పౌరసంబధాల విషయంలో తాము తలదూర్చబోమని అభ్యర్థనన నిరాకరించరు. చిదంబరం హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టుల పనిపడతానని చెప్పి చేతులు కాల్చుకొన్నాడు. 1967నక్సలైట్ల పేరుతో ఈ ప్రజా తిరుగుబాటు ప్రారంభమై 2013 వచ్చే సరికి రెండు వైపులా కొన్ని వందల ప్రాణాలు పోయాయి. ఆ రాష్ట్రంలో మావోయిస్టులు దుర్భేద్యమైన కోటను నిర్మించుకొన్నారు. ప్రధానిని, సోనియాను పరుగులు తీయించారు. ఉద్యమం కొన్ని రాష్ట్రాలకు విస్తరించింది. కోట్ల రూపాయలు కుమ్మరించారు. ప్రభుత్వం ఓడిపోతూనే ఉంది. ఆదివాసుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రభుత్వం తన బలగాలతో ఈ సమస్యను పరిష్కరించ పూనడం వృధా ప్రయాస అని మేధావులు, ప్రజా సంస్థలు సుద్దులు చెపుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మావోయిస్టులు తమ వ్యూహాల గురించి పురాలోచించుకోవాలి. ఆదివాసుల పునరావాస తదితర సమస్యలు పరిష్కారమయ్యేదిశగా ఆ వ్యూహాలు రచించుకోవాలి.
– వి హనుమంతరావు
వీక్షణం సౌజన్యంతో…