తూప్రాన్ లో చేనేత హస్తకళ మేళ ప్రదర్శన
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 7:: మున్సిపల్ కేంద్రమైన తూప్రాన్ లోని లింగారెడ్డి గార్డెన్లో చీరాలకు చెందిన గ్రామీణ వీవర్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చేనేత హస్తకళ మేళ ప్రదర్శన ఈనెల 14 వరకు నిర్వహించనున్నట్లు గ్రామీణ వీవర్స్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకుడు రంగస్వామి తెలిపారు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళాకారులచే నేరుగా తయారుచేసిన పోచంపల్లి మంగళగిరి చీరాల చీరలు డ్రెస్ మెటీరియల్స్ కలంకారి చీరలు ఉప్పాడ నారాయణపేట గద్వాల్ మాధవరం పట్టుచీరలు ప్రొద్దుటూరు అంగి బట్టలు వరంగల్ టవల్స్ లుంగీలు దుప్పట్లు ఖాదీ వస్త్రములు సూపర్ కవర్స్ తో పాటు కొండపల్లి ఈటికొప్పాక చిక్కబొమ్మలు హైదరాబాద్ నుంచి ముత్యములు సారంగాపూర్ నుండి చెక్కతో తయారుచేసిన ఆర్టికల్స్ బ్లాక్ మెటల్ బైక్ మెటల్ జూటు లెదర్ బ్యాగులతో జైపూర్ బ్యాంగిల్స్ మొదలగు అన్ని రకాల వస్తువులను ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు గ్రామీణ ప్రాంతాలకు చేనేత హస్తకళ మేళా నిర్వహించాలని ఉద్దేశంతోటి తాము ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని తూప్రాన్ మరియు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు సందర్శించవచ్చు అని వారు ఇష్టపడిన వస్తువులను కొనుక్కోవచ్చని ఆయన తెలిపారు తాము విక్రయించే ప్రదర్శన లో తాము తయారు చేసిన చేనేత హస్తకళ ల వస్తువుల్ని విక్రయిస్తున్నామని ఆయన తెలిపారు తమ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అన్ని ముఖ్య పట్టణాలలో ప్రదర్శనలు నిర్వహించామని ఆయన తెలిపారు