తెలంగాణలో కొలువుల జాతర

2

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోలకు అవకాశాల కోసం చర్యలు తీసుకుంటుంది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నింపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా 1400 కు పైగా ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. 1000 అగ్రికల్చర్‌ ఎక్స్‌ టెన్షన్‌ ఆఫీసర్‌ (ఏఈఓ) పోస్టులు, 137 ట్రాన్స్‌ పోర్ట్‌ శాఖ ఉద్యోగాలు, 340 ప్రొహిబిషన్‌ కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసింది. మే 4 నుంచి

నిరుద్యోగుల దరఖాస్తులను స్వీకరించనున్నారు.