తెలంగాణలో పెట్టబడులకు పలు సంస్థల ఆసక్తి

4

– రూ.125 కోట్లతో టీ-ఫండ్‌

-మంత్రి కేటీఆర్‌

్‌ముంబై,మార్చి9(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సుజలాన్‌ సంస్థ ఆసక్తిగా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సుజలాన్‌ సంస్థ సీఎండీ తులసీపంటితో కేటీఆర్‌ బుధవారం  ముంబయిలో సమావేశమయ్యారు. ఆయన ఒక రోజు ముంబై పర్యటన విజయవంతమైంది.విసి సర్కిల్‌ పార్టనర్స్‌ సమ్మిట్‌ లో ప్రసంగించిన మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ లో వ్యాపారం, పరిశోధనలకు ఎన్నో వసతులు కల్పించామని వెల్లడించారు. త్వరలోనే రూ.125కోట్లతో టీఫండ్‌ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పలు అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు టీఫండ్‌ లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. టీఫండ్‌ ద్వారా ఆరోగ్యం, వ్యవసాయం, సాంకేతిక రంగాలకు సహాయం చేస్తుందన్నారు. తెలంగాణలో వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలు ప్రభుత్వ ప్రణాళికలను కేటీఆర్‌ వివరించారు. సమావేశం అనంతరం సుజ్లాన్‌ గ్రూప్‌ ఉన్నతాధికారులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. 3000 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌, 1200 కోట్ల రూ. ఏర్పాటు పై సమావేశంలో చర్చించారు. మహీంద్రా గ్రూప్‌ ఎండీ అనంద్‌ మహీంద్రాతో, కోటక్‌ గ్రూప్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌ తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణకు మరిన్ని ఉద్యోగాలు, పెట్టుబడులకు ఉదయ్‌ కోటక్‌ హవిూ ఇచ్చారు. ముంబైలో ఒక రోజు పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ బిజిబిజిగా గడిపారు. తెలంగాణలో పెట్టుబడులను అహ్వనిస్తూ మహీంద్రా గ్రూప్‌ అధిపతులతోపాటు, సుజ్లాన్‌ కంపెనీ ఉన్నతాధికార బృందంతో చర్చలు జరిపారు. సుజ్లాన్‌ ఎండీ తులసి తంతి తో సమావేశమైన మంత్రి కేటీఆర్‌ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. త్వరలోనే తెలంగాణలో 3000 వేల మెగావాట్ల సోలార్‌ , విండ్‌, హైబ్రీడ్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే బృహత్తర ప్రణాళికను ప్రకటించింది. ఇందుకోసం మెత్తం 1200 కోట్ల రూపాయాల పెట్టుబడిగా పెట్టనున్నట్లు సంస్ధ తెలిపింది.  రాష్ట్ర ప్రభుత్వం తరపు సుజలాన్‌కు పూర్తి సహకారం ఇస్తామని కేటీఆర్‌ హావిూ ఇచ్చారు. ముంబైలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వీసీ సర్కిల్‌ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రాధానోప్యాసం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సవివరంగా తెలిపారు. ఇక సుజలాన్‌ సంస్థ సీఎండీ తులసీపంటితో కేటీఆర్‌ సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్‌ విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సుజలాన్‌ సంస్థ ఆసక్తిగా ఉందన్నారు.