తెలంగాణ ఉద్యోగి బహిరంగ లేఖ


ప్రియమైన తెలంగాణ ద్రోహుల్లారా…..
ప్రత్యేక తెలంగాణ మా జన్మహక్కు, చరిత్ర తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. తెలంగాణ బ్రతుకు పోరాటంను విమ ర్శించడం మాని, పరిష్కారంకై వెతకండి. తెలంగాన ఉద్మమాన్ని అణచివేయాలని చూస్తే, చరిత్ర హీనులుగా మారతారు. నేడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున చరిత్రహీనుల్లా , పిచ్చోల్లా, పశువులకంటే హీనమైన భాషను ప్రయోగిస్తూ, తెలం గాణ బ్రతుకు పోరాటాన్ని హేళనగా మాట్లాడుతున్న తెలంగాణ వ్యతిరేక ద్రోహుల్లారా ఖబద్దార్‌!! మా అధినేతల మెప్పుకోసం మా పవిత్రమైనర తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ బిడ్డలను, తెలంగాణకై గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమ గళాన్ని విన్పిస్తున్న కేసిఆర్‌, కోదండరాం లాంటి ఉద్యమనేతల్ని, ఉద్యమ యువతను, ఉద్యోగార్ధుల్ని విమర్శించే నైతిక హక్కు వలసవాద రాజకీయాలు చేస్తున్న ఆంధ్రా పాలకులకు అసలే లేదు. మూ రాజకీయ ఉద్యోగా లను కాపాడుకోవడం కోసం మా ఉద్యమంపై బురదజల్లకండి. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? అనే అంశాలకు సమాధానాలు ఇంకా తెలియ కపోవతే గత చరిత్రను మహీనేతల అభిప్రాయాలను తెలసుకోండి.
ముందుగా భాషా ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటును చారిత్రక దృష్టితో పరిశీలిస్తే…..
1956 నవంబర్‌లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు క్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో మొట్టమొదట ఆవిర్భవించింది ఆంధ్రప్రదేశ్‌. 1953లో మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడగొట్టి ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇట్టి ఆంధ్రరాష్ట్రంలో ముందుగా కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలు మాత్రమే ఉండేవి. తెలంగాణ జిల్లాఉ అప్పుడు ఆంధ్రరాష్ట్రంలో కలువలేదు. మరల 1956 నవంబర్‌ 1న తెలంగాణ జిల్లాలను కూడా కలుపుకొని ఆంధ్రప్ర దేశ్‌గా అవతరించింది. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ స్వాతంత్య్ర సంగ్రామంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది. కానీ ఇప్పట కాంగ్రెస్‌కు ఆ పరిజ్ఞానం తెలియక సతమతమౌతుంది. 1956లో ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడ్డాక భాషా ప్రాతిపదికపై అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1960లో బొంబాయి రాష్ట్రాన్ని, మహారాష్ట్ర, గుజరాత్‌లుగా విడగొట్టారు. 1966లో పంజాబ్‌, హర్యానాలు ఏర్పడ్డాయి. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన 12 ఏళ్లకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బయల్దేరింది. ఈనాటి ఉద్యమం ఈ రోజుది కాదు. ఈ తర్వాత మూడేళ్లకే ఆంధ్ర ఉద్యమం తలెత్తింది. మరి ఈ ఉద్యమాలు ఎందుకు తలెత్తాయో అనే విషయాన్ని తెలంగాణ వ్యతిరేకులు తెలుసుకుంటే అర్థమ వుతుంది. ఏ సమస్యకైనా ప్రత్యేక రాష్ట్రామే పరిష్కారం అని మేము అనుకోవట్లేదు. అలా అనుకునే అవకాశాన్ని కల్పించింది. రాజకీయ అసమానపాలన విధానాలు. 1972లో ఆంధ్ర ఉద్యమాన్ని నడిపిన మీ నాయకత్వాన్ని బలపరుస్తూ, మీరెప్పుడైనా ఈ రోజు బలమైన ఉద్యమాలు నడిపారా? ఎందుకంటే మీకంత అవసరం లేదు. మా వనరులు, నిధులు, నీళ్లు, బొగ్గు, ఉద్యోగాలు తదితరాలన్నింటిని కొల్లగొట్టి వాటిని సర్వం అనుభవించిన మీకు ఉద్యమాలేందుకు? ఆందోళనలెందుకు? మన రాజ్యాంగం రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి విస్తృతమైన అధికారాలను ఇచ్చింది. కేంద్రంలోని పాలకులు సత్‌సంకల్పంతో వ్యవహిరిస్తారన్న, చిత్తశుద్దితో రాజ్యాంగ నిర్మాతలు కేంద్రానికి ఈ వషయంలో విస్తృతాధి కారాలిచ్చారు. రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్‌ ఇలా చెబుతుంది. ఒక క్రొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండువంతుల మెజారిటీ అవసరం లేదు. మామూలు మోజారిటీ చాలు. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంట్‌ చేసిన చట్టాన్ని రాష్ట్రాలు కోర్టుల్లో సవాలు చేసే అవకాశం కూడా లేదు. ఒక రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలంటే కేంద్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వఅ నుమతితో పన్లేదు. కాకపోతే ఒక రాష్ట్రాన్ని విభజించే ముందు ఆ రాష్ట్రాన్ని సంప్రదించాలన్న ఒక్క నిబంధనను మాత్రమే రాజ్యాంగం విధించింది. రాజ్యాంగంలోని హక్కులను వినియోగించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతూ, కోట్లాది రూపాయలు గడిస్తున్న ఆంధ్రా నేతలారా మేం అడుగుతున్న ప్రత్యేకరాష్ట్రం గూర్చి ఆనాడు రాజ్యాంగంలోనే పొందుపర్చారు. మరి రాజ్యాంగం గూర్చి కనీస పరిజ్ఞానం లేకపోవడం సిగ్గుచేటు కాదా? రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ నాడు చిన్న రాష్ట్రాలతో అభివృద్ది అన్నాడు. మరి అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగ ఫలాలు అనుభవించే మీరు ప్రత్యేరాష్ట్రం అంటే ఎందుకు శివాలెత్తుతారు? ఏది న్యాయం? ఏది అన్యాయమో? తెలుసుకోండి. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌ను చూడండి అందులో 85 లోక్‌సభ స్థానాలు, 421 శాసనసభ స్థానాలున్నాయి. స్వాతంత్య్రం లభించినప్పటినుండి ఈ రాష్ట్రానికి రాజీకయ ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంది. రాజకీయ ప్రాముఖ్యం పెరిగినా కూడా ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ది చెందలేదు. ఇది చాలా రాష్ట్రాలకంటే వెనుకబడి ఉన్నమాట నిజం. నిజానికి ఏ ఇరవై, ముప్పై ఏళ్ల క్రితమే ఉత్తరాంచల:నను ఏర్మాపటు చేసివుంటే ఈ పాటికి ఉత్తరాంచల్‌, యూపి, గణనీయంగా అభివృద్ది చెందేవి కావా? వాస్తవానికి చిన్న రాష్ట్రాల వల్ల ఫెడరల్‌ వ్యవస్థ బలోపేతం అవుతుంది. అభివృద్ది కార్యక్రమాల్లో ప్రజలు నేరుగాపాల్గొనే అవకాశం ఉంది. భారత జనాభాలో అమెరికా జనాభా సరిగ్గా మూడింట ఒక వంతు మాత్రమే. మరి అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. కనుక భారతదేశంలో మరికొన్ని రాష్ట్రాలుండే తప్పేంటి? అమెరికా ఏమైనా వెనుకబడిన దేశమా? అభివృద్దిలో ముందున్న దేశం కదా? చిన్న రాష్ట్రాల వల్ల రాజీకయలు, అభివృద్ది ప్రజలకు చేరువవుతాయి. చిన్న రాష్ట్రాల్లో సమస్యలు తక్కువుంటాయి. అభివృద్ది ఎక్కువవుతుంది. పాలకులు కూడా అభివృద్ది పథంలో పయనించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఏ ప్రాంతం ఐనా బాగా అభివృద్ది చెందినపుడు ఉద్యమాలు, ఆందోళ నలు రావు. తెలంగాణ ప్రాంతం బాగా వెనుకబడింది. మా ప్రాంతా న్ని ఎలాగైనా బాగుచేసుకోవాలన్న తపన, పట్టుదల, ప్రతీకార జ్వాలాగ్నినుండి, ఆవిర్బవించిందేనేడు మీరు విమర్శించే, మీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించే, మూ కణాల్లో వణుకు పుట్టించే ‘తెలంగాణ ఉద్యమం’ వెనుకబడిన ప్రజలు తిరుగబడినపుడు ప్రాంతీయతత్వం మొదలవుతుంది. అది ఆందోళనలకు ఉద్యమాలకు దారి తీస్తుంది. తెలంగాణ ఉద్యమం ‘అసమ అభివృద్ది’ అనే కోణంలో ముందుగా ఎగిసింది. తెలంగాణ ప్రాంతా నికి ఒక్క రూపాయి కూడా అభివృద్దికి కేటాయించను మీరేం చేస్తారో? చేసుకోండి? అన్న అహాంకార వ్యాఖ్యలకు అర్థమేంటి? అధికారం మీది, పాలన మీది, పైసలు మీవి? అన్న అక్కసుతోనే పై వ్యాఖ్యలు రాలేదా? మరి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి నిండు సభలో శాసనసభ సాక్షిగా నువ్వు ఈ మాటలంటే చీము, నెత్తురు, ప్రతీకారం అనే శాంతియుత వేదాల్ని కల్గిన మాకు మా ఉద్యమాన్న విమర్శించినపుడు ఏమన్పించదా? మీరు మా స్థానంలో ఉంటే ఇలాగే వుండేదా? మేం శాంతిని కాపాడే వారథులం కాబట్టే ఈ ఉద్యమం శాంతియుతంగా మారింది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమీషన్‌ తెలంగాణను ప్రత్చేక రాష్ట్రంగా ప్రకటించాలని పిఫారసు చేసింది. 1969లో జనవరిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదట ప్రారంభమైంది. ఆర్థిక వెనుకబాటుతనం, ఉద్యోగాలు కల్పించుట లో వివక్ష వల్ల, అసమాభివృద్ది వల్ల తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందపుడు!! తెలంగాణ ఉద్యోగాలీఉ తెలంగాణ వారికే ఇవ్వాలనే ‘ముల్కీ’ నిబంధనలు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత కూడా అమలులో వుంటాయని సుప్రీంకోర్టు 1972 అక్టోబర్‌ 3వ తేదీన తీర్పునిచ్చింది. అట్టి తీర్పుకనుగుణంగా 1972 డిసెంబర్‌ 23న పార్లమెంట్‌ ఒక బిల్లును ఆమోదించింది. దీంతోనే ఆంధ్రులు ఆంధ్ర ఉద్యమం మొదలు పెట్టారు. ‘ముల్కీ’ నిబంధనల వల్ల తెలంగాణలో ముఖ్యంగా హైద్రాబాద్‌లో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోగలమని ఆంధ్రా విధ్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చేయగా మనకు ముల్కీ నిబంధనలు అమలు పర్యాలని తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులు పట్టుబట్టారు. ఇలా ఆందోళన లు చెలరేగి హింసాకాండ మొదలవడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. చివరికి ప్రభుత్వం ఇరువర్గాలకు ప్రయోజనం చేకూరేలా ఆరు సూత్రాల పథకం రూపొందించి. అందులో తెలంగాణ ప్రాంతీయ కమిటీ మరియు ముల్కీ నిబంథ నలు రద్దు ఈ పథకంలోని ముఖ్యాంశాలు. దీంతో తెలంగా ణవాదులు అప్పుడు ఇంకా ఉద్యమ సారథులై ప్రతి ఒక్కరూ ఉద్య మాన్ని ముందుకు నడిపంచారు. 1949లో పండిట్‌ జవహార్‌లాల్‌ నెహ్రూజీ, సుభాష్‌ చంద్రబోస్‌కు ఒక ఉత్తరం రాస్తూ ఏమైనా సరే ఐక్యతగా వుండాలనుకోవడం అర్థ రహితం అని రాశాడు. ఐక్యత అనేది ఎప్పుడైనా అనైక్యతకంటేఉత్తమమైందే
కానీ బలవంతంగా కూర్చే ఐక్యత వంచనతో కూడింది. ప్రమాద కరమైంది అని పండిట్‌ నెహ్రూజీ చెప్పిన మాటల చరిత్రను చదవం డి ఆంధ్రాపాలకులారా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్‌కు గల కారణాలను తెలుసుకోకుండా తాత్కాలికంగా కలిసివుందామని చెప్పడంలో ఎంత వివక్ష వుందో? దీంతో ప్రస్తుతం అసలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వుందా? అప్రజాస్వా మిక పాలన కొనసాగుతుందా? అనేది అర్థంకాని రీతిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎంఒదరో తమ ప్రనాణాలను పణంగా పెట్టి వందలాది మంది నాటి నుండి నేటి వరకు బలవుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో అభివృద్ది సమానంగా లేదు. రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య అసమానతలను నిర్మూలించే కార్యక్రమాలకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వకుండా తమ స్వార్థ ప్రయోజనాలకే ఆసక్తి చూపుతుండ్రు. పంజాబ్‌, కాశ్మీర్‌లో వేర్పాటువాదం తలెత్తి దేశాన్ని అతలకుతలం చేసింది. పశ్చిమ బెంగాల్లో గుర్ఖాలు ‘గూర్ఖా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌’ క్రింద సమీకృతులై తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 1968-69లో తెలంగాణ ఉద్యమం 1972-73లో ఆంధ్ర ఉద్యమాలు జరిగాయన్న గత చరిత్రను చదవలేదా? లేదా తెలుసుకోవాలన్న కనీస పరిజ్ఞానం లేదా తెలంగాణ ద్రోహుల్లారా!! ఈ రోజు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం మళ్లీ 2001లో ఊపందుకుంది. ఎన్నో ఉద్యమాలు ఎంతో మంది ప్రాణాలు, త్యాగాలు చేసిన చరిత్ర మా తెలంగాణ ఉద్యమానిది. మరీ నీ ఆంధ్రరాష్ట్ర ఉద్యమ చరిత్ర ఏది? ఇటువంటి చారిత్రక చరిత్ర కల్గిన తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణకై పవిత్రంగా ఉద్యమించే నాయకులను విద్యార్థులను, మేధావులను, ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజానీకాన్ని చులకన చేసి, బలహీన పర్చి మాట్టాడే మీరు మీ నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడండి లేకపోతే చరిత్రహీ నులుగా మారుతారు, మిగిలిపోతారు.
తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమ చరిత్రను గురించి రాయాలంటే ఏ కలాలు సరిపోవు. ఎన్ని కాగితాలు సరిపోవు. నేటి మానవుడి ఆలోచనా శక్తి సరిపోదు. మిగిలి ఉన్న కాలమాన చక్రంలోని యుగాలు సరిపోవు. అందుకే పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని పల్లేత్తుమాటన్న తెలంగాణ ఉద్యమ చరిత్రను హేళన చేయాలనుకునే వాళ్లు కాలగర్బంలో కలిసి చరిత్రహీనులుగా మారతారు. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండా?
జై తెలంగాణ………జై జై తెలంగాణ
– గుర్రపు రాజమౌళి, చిట్యాల, వరంగల్‌.