తెలంగాణ ఏర్పాటు వల్లనే ముస్లింలకు మేలు

మన భూగోళంపై పుట్టిన జీవి ఏదైనా తనకు చేతనైన విధంగా కడుపునకు చాలినంత తిండి సంపాదించుకుంటుంది. కడు పునిండా తిని నిశ్చింతగా నిద్రపోతుంది. ఆ పూటకు చాలినాక కూడా మరించి దోచి దాచి పెట్టుచుకోవాలని అనుకోదు. పులి అయి నా సింహమైనా తాను వేటాడిన జంతువును తిన్నంత తిని పక్కకు తొలగిపోతుంది. అది ప్రకృతి సహజం. కాని ఆ జీవుల్లోంచే ఎదిగిన మనిషి మాత్రం తనకు చాలినంత సంపాదించుకుని కూడా అత్యా శకు పోయి మరింత కూడబెట్టుకునేందుకు అలవాటుపడ్డాడు. అందులో భాగంగానే వెనకబడ్డ జాతుల్ని, వెనకబడ్డ ప్రాంతాల్ని అభి వృద్ధి చెందిన జాతులు, ప్రాంతాల వాళ్లు దగా చేయడం, దోచు కోవడం జరుగుతున్నది. ఇదే అంశం తెలంగాణ విషయంలోనూ, తెలంగాణ ముస్లింల విషయంలోనూ అన్వయించుకోవచ్చు. ఆంధ్రా వారు తెలంగాణను ఆక్రమించుకోవడంలోనూ, ముస్లిమీయత కలగ లిసిన తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేయడంలోనూ, ఈ క్రమమే కనిపిస్తుంది. అది ముస్లింలలో మరింత కనిపిస్తుంది. అలాంటి వారికి దోచుకుని దాచుకునే స్వభావం కల ఆంధ్రా వారిని కలప డమే చరిత్రలో జరిపిన ఒకానొక తప్పు. అందువల్లనే ఇలా భిన్న సంస్కృతులున్న రెండు జాతుల మధ్య ఘర్షణ నిత్యంగా జరుగుతూ వస్తున్నది. దీనికి పరిష్కారం ఒక్కటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్లనే ఇక్కడి ముస్లింలకు మేలు జరుగుతుంది. తెలంగాణను ఆంధ్రలో కలపడం వలన తెలంగాణ ముస్లింలు చాలా నష్టపోయారు. వారు నష్టపో యిన ఒక్కోరంగాన్ని ఇలా విశ్లేషించుకోవచ్చు.

1. సంస్కృతి : తెలంగాణవారు వందల సంవత్సరాలు కుతుబ్‌ షాహీలు, అసఫ్‌జాహీల పాలనలో ఉండటం వలన, అదనంగా చుట్టూరా మొగలాయీ పాలన కూడా ఉండటంతో వారి సంస్కృతి అంతా ప్రాచ్య (ఓరియంటల్‌ దేశాల). ఇరాన్‌ పర్షియా, ఇరాక్‌, టర్కీ వగైరా సంస్కృతితో ప్రభావితమైంది. కాబట్టి ఇక్కడి భాష, వేష ధారణ, ఆహారపు అలవాట్లు, నిద్ర, కళలు, సాహిత్యం అన్నీ కూడా ప్రాచ్య దేశాలను పోలి ఉంటాయి. గ్రామాల్లో ఈ ప్రభావం కొంత తక్కువ కనిపించినా పట్టణాలు, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సం స్కృతి వేళ్లూనుకునిపోయింది. ఈ సంస్కృతికి భిన్నంగా చివరి 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో ఉండిన ఆంధ్రా ప్రాంతంవారు పశ్చిమ దేశాల (బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా వగైరా సామ్రాజ్యవాద సంస్కృతికి అలవాటు పడ్డారు. ఈ రెండు సంస్కృతుల వల్ల క్లాష్‌ ఏర్పడుతున్నది అందువల్లనే.

తెలంగాణ ముస్లింలు భూములు కోల్పోయిన వారిగా, ఆంధ్రావాళ్లు భూములు ఆక్రమించుకున్న వారుగా మనకు ఎన్నో దాఖలాలు తెలంగాణలోనూ ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టూరా కనిపించడం అందుకు నిదర్శనం.

2. భాష : 200 సంవత్సరాలు నిజాంల పాలనలో ఉండడం వల్ల రాజభాషగా ఉర్దూ ఉన్న కారణంగా తెలంగాణ వారందరూ చాలా వరకూ ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు. ఉర్దూ ప్రభావం వల్ల ఇక్కడి తెలుగు డిఫరెంట్‌ యాక్సెంట్‌ను తీసు కుంది. వేల ఉర్దూ పదాలు తెలుగైజ్‌ అయ్యాయి. తెలుగు ఉర్దూ మిక్స్‌డ్‌ లాంగ్వేజ్‌లో ఇక్కడి వాళ్లు మాట్లాడుకోవడం చూస్తాం. అలా ఆ మిక్స్‌డ్‌ భాష ఇక్కడి వారి జీవితంలో భాగమైంది.

అయితే హైదరాబాద్‌ రాజ్యాన్ని విభజించి ముక్కలు చేసి తెలంగాణను ఆంధ్రలో కలపడం వలన భాషాపరంగా ఎనలేని నష్టం జరిగింది.

కిసీ ఖౌమ్‌కో బర్బాద్‌ కర్నా హైతో

పహ్‌లే ఉస్‌ కీ జబాన్‌ ఖీంచ్‌లో…

అన్నట్లుగా తెలంగాణ వారితో పాటు ఇక్కడి ముస్లింల భాషను గుంజుకోవడం, ధ్వంసం చేయడం జరిగింది. ఇంకా ఇంకా జరుగుతున్నది.

ఉర్దూ మీడియం పాఠశాలలన్నీ తెలుగు మీడియం పాఠశాలలుగా మాచ్చబడ్డాయి. సరే, నాచురల్‌ అనుకుందాం. కానీ తెలంగాణ తెలుగువారు ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా అధ్యాప కులుగా నియమితంచబడితే వారికి ఇక్కడి పరిస్థితుల మీద మను షుల మీద ప్రేమ ఉండి అర్థం చేసుకుని మసలేవారు. అలా కాకుం డ ఆంధ్ర నుంచి వలస వచ్చినా, తీసుకురాబడిన తెలుగువారి వల్ల ఇక్కడివారు, ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా అవహేళనకు గుర య్యారు. వాళ్లే కాదు, హైదరాబాద్‌లో పనిచేస్తున్న లక్షలాది మంది ఆంధ్రావారు ఉర్దూపట్ల, ఉర్దూ కలగలిసిన తెలుగు పట్ల ఏమాత్రం మమకారం లేకుండా ప్రతిమాటలోనూ తెలంగాణవారిని, ముస్లింలను తక్కువచేసి మాట్లాడుతూ అవమానించారు. ఆత్మన్యూ నతతో పడవేశారు. ఈ కారణాన తెలంగాణ తెలుగు భాషకు, ఉర్దూకు ఎక్కువ నష్టం జరిగి ంది. ఉర్దూ అంతర్థానమయ్యే ప్రమాదం ఏర్ప డింది.

నిజానికి ఈ తీయని ఉర్దూ సమ్మి ళిత తెలుగు వల్ల ఇక్కడి తెలుగువారికి ముస్లిం లపై, ముస్లింలకు తెలుగువారిపై అప్రకటిత ప్రేమ, వాత్సల్యం ఉండేవి. అంటే సమ్మిళిత భాష హిందూ ముస్లింల మధ్య సహజీవనానికి తోడ్పడింది. తెలంగాణ ఏర్పడడం వలన మళ్లీ ఆ వాతావరణం వస్తుందని, రావాలని మేం ఆశిస్తున్నాం. ఆంధ్రావారి ఉర్దూ వ్యతిరేక, ముస్లిం వ్యతిరేకత నుంచి తెలంగాణ ముస్లింలు తప్పించుకోగలుగుతారు.

3. వేషధారణ : పఠానీ సూట్‌, షేర్వాని, లాల్చీ పైజమా, చుడీదార్‌ పైజమా, షట్‌ సెల్వార్‌, పైజమా ఖమీజ్‌ తదితర వస్త్ర ధారణ ముస్లింలది. ఇవి తెలుగువారు కూడా ధరించడం అలవర్చుకున్నారు. దానికి భిన్నంగా కోస్తాంధ్ర ప్రాంతం సముద్రం దగ్గరగా ఉండ డంతో వారి వస్త్రధారణలో ఎంతో తేడా ఉంది. ఉక్కపోత కారణంగా వారు లుంగీ కడితే, తెలం గాణ ముస్లింలు పైజమా వేసుకోవడం అలవా టు. ఈ పైజమాలపై బొందెలపై ఆంధ్రావారు జోకులేయడం మామూలే.

4.ఆహారపుఅలవాట్లు: హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలోనే ప్రసిద్ధి. ఆంధ్రాలో పలావ్‌ అని వండుతారు. మేము ఏమాత్రం రుచి లేని ఆ పలావ్‌ తినలేము. రంజాన్‌ అంతా హలీమ్‌, హరీస్‌ హైదరాబాద్‌లోనూ, తెలంగాణ పట్టణా లలోనూ ముఖ్యమైన ప్రత్యేక వంటకంగా విరి విగా అమ్ముడుపోతుంది. రంజాన్‌ పండుగ రోజు చేసే సేమ్యా అనేది మరో ప్రత్యేక వంట కం. ఆ వంటకం పట్ల ఊర్లలో తెలుగువారు చాలా ఆసక్తి చూపుతారు. ముస్లింలు కూడా తెలుగువారిని ప్రత్యేకంగా ఆరోజు ఇంటికి పిలిచి సేమ్యా ఇస్తారు. ఇవాళ ఆనపకాయ (సొరకాయ)తో చేసే ‘దాల్చ’ ముస్లిం ఇండ్లల్లో ప్రత్యేక వంటకం. పెళ్లిళ్లలో ఇది తప్పనిసరి. దీనికి ప్రతిగా ఆంధ్రాలో సాంబార్‌ అనే వంటకం చేస్తారు. ముస్లింల వల్ల అలవాటైన నాన్‌వెజ్‌ వంటకాలు తెలంగాణలో ఎక్కువ. వాటిలో రకాలు ఎన్ననేది లెక్కించలేం.

అట్లే పానీయాల విషయంలోనూ తేడావుంది. తెలంగాణలో చాయ్‌ (టీ) తాగితే, ఆంధ్రాలో కాఫీ తాగుతారు. ఆంధ్రా టీకి తెలంగాణ టీకి తేడా ఉంటుంది. ఇరానీ చాయ్‌కు ఈ ప్రాంతం ప్రసిద్ధి. పౌనా, మలాయ్‌ చాయ్‌, … తదితర రకాలు ఇక్కడ దొరుకుతాయి.

5.కళలుసాహిత్యం : కళలు, సాహిత్యం విషయంలోనూ చాలా తేడా ఉన్నది. ఉర్దూ ముషయిరాలు రాత్రి అన్నం తిన్న తర్వాత మొదలై రాత్రంతా నడిచే సంస్కృతి ఇక్కడ ఉన్నది. ఉర్దూ కవులు, రచయితలు తెలంగాణ అంతటా ఉన్నారు. హైదరాబాద్‌లో ఎక్కు వగా ఉన్నారు. ఖవాలీ ప్రోగ్రాములు కూడా ఇక్కడ ఎక్కువే. ఆంధ్రా ప్రాంతంలో ఇవి కనిపించవు. ఇలా ఇంకా ఎన్నో విషయాలలో తేడాల వల్ల వారికీ వీరికీ పొసగని పరిస్థితి ఉంది. ఆంధ్రా వారి డామినేషన్‌ ఎక్కువ కావడంతో ముస్లిం కల్చర్‌లో ఇలాంటి విభిన్న సాంస్కృతిక విషయాలు వివక్షకు గురవుతున్నాయి. ఆంధ్రావారికి తెలంగాణ ముస్లింలపై ఏమాత్రం ప్రేమలేదు. పైగా చిన్నచూపు. వెకిలి చూపూ. తమ ఆంధ్ర సంస్కృతి నుంచి ప్రతిదాన్నీ చూస్తూ ముస్లిం సంస్కృతుల్ని, అది మిళితమైన తెలంగాణ సంస్కృతిని చుల కన చేస్తూ వస్తున్నారు. మాకు సంస్కృతీ సంప్రదాయాలు, భాష రాదని, తాము వచ్చి అన్నీ నేర్పామని, నేర్పుతున్నామని నిజమైన సంస్కృతి నేర్పుతున్నామని అహంభావాన్ని ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా ముస్లింల సంస్కృతి అంటే అదేదో పరాయి సంస్కృతి అన్న ఏహ్యభావం చూపుతుంటారు. వీటివల్ల వారికి తెలంగాణ ముస్లింలపై ఏనాడు ప్రేమలేదు.

విద్యలో ముస్లింల శాతం చాలా తక్కువగా వుంది. దాని గురించి ఆంధ్రా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉద్యోగాల్లోనూ ముస్లిం శాతం హైదరాబాద్‌ రాజ్యం ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తగ్గిపోయింది. వీటి గురించి కూడా ప్రభుత్వాలకు చింతలేదు. ఆరి ్థకంగా కూడా ఆంధ్రావారి వల్ల తెలంగాణ ముస్లింలు బాగా నష ్టపోయారు. రోడ్‌సైడ్‌ చిల్లర వ్యాపారల్లోనే ముస్లింలు ఎక్కువగా ఒది గిపోతున్నారు. డబ్బు సంచులతో వలస వచ్చి పెద్ద పెద్ద షాపులు, మాల్స్‌, ఫ్రూట్‌ మార్కెట్స్‌ తెరిచే ఆంధ్రావారితో చిన్న సన్న ముస్లిం వ్యాపారస్తులు పోటీ పడలేక ఎంతో నష్టపోతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఒక పెద్ద సమూహం (దాదాపు 15 నుంచి 20 శాతంగా ఉన్న సమూహం) అన్ని రంగాల్లో వెనకబడి ఉంటే రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యం?

ఆంధ్రావారు వచ్చాకే మత ఘర్షణలు : ఆంధ్రావారు వచ్చాకే హైదరాబాద్‌లో మత ఘర్షణలు జరిగాయి. అంతకుముందు వందల ఏళ్లుగా తెలంగాణలో హిందూ ముస్లింలు కలిసి మెలిసి సహజీవనం కొనసాగిస్తున్నారు. ఆంధ్రా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రుల్ని మార్చడానికి హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. తెలంగాణలోని తెలుగు వారికీ, ముస్లింలకూ మధ్య సహజీవనం పెంపొందించుకోవాలన్నా వీలైనంత త్వరగా ఆంధ్రావారి నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం అవసరం.

చారిత్రకంగా, సాంస్కృతికంగా ఉన్న భావ సారూప్యత, సాంస్కృతిక సారూప్యత వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవడం, శాంతిని స్థాపించుకోవడం ద్వారా సహజీవనం సాగించే అవకాశం ఉంది.

అలాగే తెలంగాణలో ముస్లిం జనాభా పరంగా అధిక శాతంగా ఉంటారు. ఇక్కడ ఎస్సీ, బీసీలూ ఎక్కువే. కాబట్టి ముస్లింల ప్రాతి నిధ్యం అన్ని రంగాలతో పాటు రాజకీయంగానూ ఎస్సీ, బీసీలతో పాటు భాగం పంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఏరకంగా చూసినా ముస్లింలకు తెలంగాణ ఏర్పడటం అవసరం. చైతన్య వంతులైన ముస్లిం రచయితలుగా మేమంతా, మా సంఘం తరఫున తెలంగాణకు మద్దతు తెలుపుతున్నాం.

– స్కైబాబ

జఖ్మీ ఆవాజ్‌ నుంచి