తెలంగాణ కొత్త సచివాలయానికి రూ.150 కోట్ల విడుదల

4

కొత్త సచివాలయం – విధివిధానాలు ఖరారు

హైదరాబాద్‌ మార్చి 24 (జనంసాక్షి):   తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి స్థలంలో కొత్త సచివాలయం నిర్మాణం 150 కోట్ల రూపాయలు  ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సచివాలయంలో వివిధ విభాగాలకు ఎంతెంత స్థలం కావాలి? మొత్తం ఎంత స్థలం కావాలి? తదితర అంశాలన్నిటినీ చర్చించి ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియిమించింది.సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా అయిదుగురు

సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సీఎం, సీఎం కార్యాలయం, మంత్రులు, మంత్రుల పేషీలు, సచివాలయం సిబ్బంది, హెచ్‌ఓడీలకు కావలసిన స్థలంపై ఈ కమిట

ీ చర్చిస్తుంది. అలాగే సీఎం క్యాంపు కార్యాలయం, ఐఏఎస్‌లకు కొత్త క్వార్టర్స్‌పై కూడా ఈ కమిటీ విధివిధానలు ఖరారు చేస్తుంది.