తెలంగాణ నిరుద్యోగులు ఆందోళన వద్దు

4

-ఉద్యోగాల భర్తీకి కసరత్తు

-చక్రపాణి

న్యూఢిల్లీ,మార్చి 23 (జనంసాక్షి):  యూనియర్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) చైర్మన్‌ దీపక్‌గుప్తాతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  యూపీఎస్సీ పరీక్షా విధానం, సిలబస్‌, మార్కుల అంశంపై చర్చించారు.  ఈ సమావేశానికి యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ అధికారులు హాజరయ్యారు. ఉద్యోగాల భర్తీలో యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలు, మార్పులు, సిలబస్‌ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, ఖచ్చితంగా భర్తీ ప్రక్రియ చేస్తామని అన్నారు. ఉద్యోగాల నియామకానికిి తెలంగాణ సర్వీస్‌ కమిషన్‌ కసరత్తు చేస్తోందని అన్నారు. దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీకి అవకశాలు ఉన్నాయన్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ తెలియాల్సి ఉందన్నారు. కమలనాథన్‌ కమిటీ ఉద్యోగల విబజన ప్రక్రియను వేగవంతం చేస్తే ఎన్ని ఖాళీలు ఉన్నయన్నది తెలుస్తుందన్నారు.