తెలంగాణ పర్యాటక అధ్యక్షుడుగా పేర్వారం

1

హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): తెలంగాణ టూరిజం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా మాజీ డీజీపీ పేర్వారం రాములును నియమించారు సీఎం కేసీఆర్‌. ఆయనకు కేబినెట్‌ ¬దా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యులుగా ఉన్న పేర్వారం రాములుకు సాహిత్యం, కళలు, పర్యాటక రంగాల్లో విశేష అనుభవం ఉంది. వరంఘల్‌ జిల్లాకు చెందిన పేర్వారం రాములు గతంలో జనగాం నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ ఇంచార్జిగా పనిచేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా రాములు టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీవలో చేరినప్పటినుండి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచిన రాములుకు తగిన పదవినిచ్చి ముఖ్యమంత్రి సత్కరించారని చెప్పొచ్చు. డీజీపీగా విధి నిర్వహణలో భాగంగా రాములు పోలీసుశాఖలో పలు సంస్కరణలకు కారణమయ్యారు. ఆయన హయాంలో పోలీసు వ్యవస్థలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పదవి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని, తెలంగాణ పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేసేంజుకు కృషి చేస్తానని రాములు పేర్కొన్నారు.