తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్
సర్కారు ప్రజావ్యతిరేక చర్యలపై పోరాడతా
అందర్నీ కులుపుకుపోతా
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
న్యూఢిల్లీ/హైదరాబాద్,మార్చి2(జనంసాక్షి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా సీనియర్ నేత, హుజుర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. పొన్నాల లక్ష్మయ్యను పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్ అధిష్టానం ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పగ్గాలు ఇచ్చింది. పార్టీని బలోపేతం చేయడానికే ఈ మార్పు చేసినట్లు సీనియర్ నేతలు అంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క నియామకం అయ్యారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ శాసనసభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమిస్తూ ఇప్పటికే నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడి నియామకంపై సోమవారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మల్లు భట్టివిక్రమార్కను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, పరిస్థితులను సోనియాకు వివరించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భట్టి విక్రమార్కలను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో కాంగ్రెస్ కు,కార్తకర్తలకు సేవ చేసే అవకాశం గా భావిస్తున్నామని కొత్తగా టిపిసిసి అద్యక్షుడు అయిన ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. సీనియర్ లు అందరిని కలుపుకుని పార్టీని ముందుకు తీసుకు వెళతామని అన్నారు. టిఆర్‌ఎస్ నేతలు ప్రజలను మభ్య పెట్టే విధంగా హావిూలు ఇచ్చారని ,అందువల్ల వారు అధికారంలోకి వచ్చారని అన్నారు. కాని వారు ఇచ్చిన హావిూలు ఏవీ నెరవేరడం లేదని అన్నారు. డల్లాస్,లండన్ పేర్లు చెప్పే నేత దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రిజర్వేషన్,ముస్లిం రిజర్వేషన్ వంటివాటిపై ఒక్క అడుగు ముందుకు వేయలేదని అన్నారు. వీటన్నిటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన అన్నారు. తాము కూడా కొంతకాలం వేచి చూడాలని ఆగామని ఈ సందర్బంగా ఉత్తం అన్నారు. కాని ఇంతకాలం గడిచినా ప్రబుత్వం ఒక్క అడుగు ముందుకు వేయలేదని అన్నారు.వీటన్నటిని వచ్చే సమావేశాల్లో ఎండగడతామని అన్నారు. ఏఐసీసీ ఎట్టకేలకు పార్టీ ప్రక్షాళనను చేపట్టింది. ఈ మేరకు ఇవాళ ఏఐసీసీ వివిధ రాష్టాల్రకు కూడా పీసీసీ (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా అశోక్‌చౌహాన్, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అజయ్‌మాకెన్, గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు- భరత్‌సిన్హా సోలంకి నియమితులయ్యారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను అనైతికంగా టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై నిలదీస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియిమితులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అలాగే టిఆర్‌ఎస్ ప్రజలకు చేసిన వాగ్దానాలపైనా అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని అన్నారు. సోమవారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విూడియాతో మాట్లాడారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తామని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇతర పార్టీలను నాశనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజల పక్షాన ఉండి పోరాటం సాగిస్తామన్నారు. అదేవిధంగా ఎన్నికల హావిూల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. పార్టీలోని సీనియర్లను, జూనియర్లను అందరినీ కలుపుకు పోతానని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తామని తెలిపారు. నేతలు, కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఉద్ఘాటించారు. యువతను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. రెండు నెలల్లో గ్రామ స్థాయి నుంచి నూతన కమిటీలు వేస్తామన్నారు. ఇప్పటి వరకు పదవులు అనుభవించని వారికి అవకాశం ఇస్తామని ప్రకటించారు. పీసీసీ అధ్యక్ష పదవి తనకు రావడం అదృష్టంగా ఉందన్నారు. తనకు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పిన సోనియా, రాహుల్, దిగ్విజయ్, కుంతియాకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ నెల 6న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన ఆయన సోమవారం తన నివాసంలో విూడియాతో మాట్లాడారు. సీఎల్పీ నేత జానారెడ్డి సూచనలు, సలహాలతో ముందుకెళతానని చెప్పారు. ఏఐసీసీలో అన్ని వర్గాలకు పదవులు దక్కుతాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తనను నమ్మి పీసీసీ బాధ్యతలప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం కృషిచేస్తానని, రాష్ట్రంలోని యువతను కాంగ్రెస్ వైపుకు ఆకర్షించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలపరుస్తామని, త్వరలోనే గ్రామ, మండల, జిల్లా, రాష్టా కమిటీలను ఏర్పాటుచేస్తామని ఉత్తమ్ వివరించారు. గతంలో అవకాశం రానివారికి పదవులు ఇస్తామని హావిూ ఇచ్చారు. యువతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. నిజాయితీతో ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఉదోగ్యాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని ఉత్తమ్ కుమార్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తనకు కుటుంబం వంటిదని, పార్టీ పటిష్టానికి , ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సంవత్సరం పాటు కృషిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ కు,కార్తకర్తలకు సేవ చేసే అవకాశం గా భావిస్తున్నామని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ నేతలు ప్రజలను మభ్య పెట్టే విధంగా హావిూలు ఇచ్చారని ,అందువల్ల వారు అధికారంలోకి వచ్చారని అన్నారు.కాని వారు ఇచ్చిన హావిూలు ఏవీ నెరవేరడం లేదని అన్నారు. హావిూలన్నటింపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన అన్నారు. తాము కూడా కొంతకాలం వేచి చూడాలని ఆగామని ఈ సందర్బంగా ఉత్తం అన్నారు.కాని ఇంతకాలం గడిచినా ప్రబుత్వం ఒక్క అడుగు ముందుకు వేయలేదని అన్నారు.