తెలంగాణ ప్రజలకు సీఎం ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్,మార్చి20(జనంసాక్షి): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఏడాదంతా ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని..అందుకు ఉగాది పర్వదినం ఆరంభం కావాలని ఆకాంక్షించారు.