తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మైసమ్మకు బోనాలు
మైసమ్మ తల్లికి జోడు బోనాలు సమర్పించిన ట్రాన్స్ జెండర్స్
జనగామ (జనం సాక్షి)ఆగస్ట్14: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోశాలలో వర్ధిల్లాలని జనగామ జిల్లా ట్రెండ్స్ జెండర్ ఆధ్వర్యంలో శ్రావణమాసం ఆదివారం సందర్భంగా మైసమ్మకు బోనాలు ఎత్తారు .శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం అందరూ బాగుండాలి అని మైసమ్మ తల్లిని కొలుస్తూ శ్రావణ ఆదివారం చిటకోడూరు రిజర్వాయర్ వద్ద మైసమ్మ గుడిలో ఘనంగా జోడు బోనాలు,వడి బియ్యాలు సమర్పించారు .
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ట్రాన్స్ జెండర్స్ అధ్యక్షురాలు ఓరుగంటి ఉష, నిత్య, ఆకాంక్ష తదితరులు పాల్గొన్నారు.
Attachments area