తెలంగాణ సుభిక్షం కావాలి..సీఎం కేసీఆర్‌

1B

1A
ఎంత సంపాదించామన్నది కాదు, ఎంతిచ్చామన్నది ముఖ్యం..అబ్దుల్‌ కలాం

రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు

హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): జీవితంలో ఏం సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఏం ఇచ్చామనేదే ముఖ్యమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు. రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడుతూ సూర్యుడు, నదులు, భూమి.. అన్నీ ఇచ్చేవేనని, మనం వాటిని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఒక గొప్ప నాగరికత, సంప్రదాయాలకు మనం వారసులమన్నారు. హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ డీఆర్‌డీవోలో 2500 మంది సభ్యులతో తాను కలిసి పనిచేశానని, అగ్ని, పృథ్వీలను ఇక్కడే రూపకల్పన చేశామని ఆయన గుర్తుచేసుకున్నారు. ఉగాది పండుగ జరుపుకొంటున్న తెలుగువాళ్లందరికీ తన శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం హాజరయ్యారు. గవర్నర్‌ దంపతులు అబ్దుల్‌ కలాంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని ఆయన  అన్నారు. ఇక రాజ్‌భవన్‌లో జరుగుతున్న ఉగాది వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు ఇరు రాష్టాల్ర ముఖ్యమంత్రులు హాజరు కావలసి ఉంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఈ వేడుకలకు విచ్చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తరవాత సిఎం కెసిఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుప్రజలు, భారత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. పలవురు ప్రముఖులు హాజరయ్యారు. గవరన్నర్‌ నరసింహన్‌ మంచి సంప్రదాయం నెలకోల్పి ఉగాది ఉత్సవాలను నిర్వహించినందుకు అభినందించారు. తరవాత సిఎం కెసిఆర్‌ను గవర్నర్‌ సత్కరించారు. రాజ్‌భవన్‌లో

గవర్నర్‌ నరసింహన్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.

మందులు కాదు నివారణ ముఖ్యం: కలాం

ఇదిలావుంటే మాజీ రాష్ట్రపతి అంతకుముందు నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోగాలకు చికిత్స చేయడం కంటే వాటిని ముందుగా నివారించడం చాలా అవసరమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అన్నారు. బాలానగర్‌లోని నైపర్‌ నాలుగో స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫార్మా రంగానికి ఇది ఒక సవాలులాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. అరుదైన రోగాలకు ఔషధాలను కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా రోగాలు వ్యాప్తిచెందకుండా వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే మందుల తయారీకి సంబంధించి పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఫార్మా రంగ కార్యదర్శి డాక్టర్‌ సుబ్బురాజ్‌, సంయుక్త కార్యదర్శి అరీజ్‌ అహ్మద్‌, ఐఐసీటీ డైరెక్టర్‌ లక్ష్మీకాంతం, నైపర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ కమల్‌ పాల్గొన్నారు.