తెలుగుదేశంపార్టీలో బిసిలకు పెద్ద పీట
రెడ్డి సుబ్రహ్మణ్యం
కాకినాడ, జూలై 21, : తెలుగుదేశంపార్టీలో బిసిలకు పెద్ద పీట వేయడం జరుగుతుందని రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు బిసిల కోసం అహర్నిసలు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర పదవుల దగ్గర నుండి అన్ని పదవుల్లోనూ బిసి కులాలకు చెందిన వారినే నియమించడం జరిగిందన్నారు. వందేళ్ల చరిత్ర ఉందని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌పార్టీ బిసిలను అణగదొక్కుతూనే ఉందన్నారు. తమ పార్టీ నాయకులు ఎన్టీ రామారావు బిసిల కోసం పార్టీ పెట్టి రిజర్వేషన్లు తీసుకువచ్చి పార్టీలో బిసిలకు సుముచిత స్థానాన్ని కేటాయించారన్నారు. స్థానిక ఎన్నికల్లో బిసిలకు వందకు పైగా సీట్లు కేటాయించడంతో పాటు బిసిలకే పెద్ద పీట వేస్తున్నామని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో బిసిలకే అత్యధికంగా సీట్లు ఇస్తామని తమ పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు పేర్కొనడం అభినందనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో బిసిలే అగ్ర నాయకులుగా వెలుగొందుతారన్నారు.