తొలి అడుగు తెలంగాణది..మలి అడుగు ఆంద్రాది!
పేదలది చాలా పెద్ద మనసు… తమకు తలదాచుకునేంత చోటుంటే చాలని కోరుకుంటారు. గ్రామాల్లో పనులు లేక, పిల్లలను చదివించుకోలేక పట్టణాలకు వలస వస్తున్న ఎందరో మురికి కూపాల్లో నివసిస్తున్నారు. కూలీనాలీ చేసుకునే ఎందరో పొద్దున లేచింది మొదలు పాచిపనీ, ఇతరత్రా కూలీ పనులు చేసుకుని ఆ రోజు గడిస్తే చాలనకునే అభాగ్యులు ఈ దేశంలో ఎక్కువే. అలాంటి వారికి గూడుకట్టించి ఇవ్వాలన్న సంకల్పం మంచిదే అయినా ఇంతకాలం అది దారితప్పింది. దాంట్లోనూ పందికొక్కులు జొరబడ్డాయి. పేదల ఇంట్లో పెద్దలు పాగా వేసి ఇందిరమ్మ ఇళ్లను గద్దల్లా తన్నుకుపోయారు. అందుకే ఈ పథకం విజయవంతం కాలేదు. పేదలు నేటికీ గూడులేని పక్షుల్లా జీవిస్తున్నారు. తెలంగాణలో కెసిఆర్ అధికారంలోకి వచ్చాక పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న నినాదంతో ప్రాంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చరిత్ర కెక్కింది. తానుకట్టించే ఇళ్లు ఎలా ఉంటాయో చేసి చూపారు. మోడల్ హౌజ్‌లు చూస్తే పేదల గురించి ఆలోచించిన వ్యక్తిగా సిఎం కెసిఆర్ పేదలకు ఆరాధ్యదైవంగా నిలిచారు. హైదరాబాద్, ఎర్రవల్లిలో ఈ నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ఇక తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా వీటి నిర్మాణానికి పునాదులు పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి పథకాన్ని సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించడం ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పుకోవాలి. ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం కింద పట్టణ, గ్రావిూణ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంబేడ్కర్ జయంతి రోజు తెలిపారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించి ఇస్తామని హావిూ ఇచ్చారు. రాజధాని అమరావతికి అతి సవిూపంలో జక్కంపూడికి మెట్రో రైలు ప్రాజెక్టును అనుసంధానం చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.16,300 కోట్లతో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణానికి నాంది పలుకుతూ విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కొండ ప్రాంతంలో సిఎం పైలాన్‌ను ఆవిష్కరిం చారు. విజయవాడ కార్పొరేషన్‌కు మంజూరైన 10 వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు 265 ఎకరాల విస్తీర్ణంలో చైనాకు చెందిన కంపెనీ డిజైన్ చేసింది. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మిస్తామన్నారు. కాల్వ కట్టల వెంబడి, మురికివాడల లో నివాసం ఉండే కంటే, అధునాతన సౌకర్యాలతో ఎన్‌టిఆర్ ఇళ్లలో నివాసం ఉండటం ఎంతో మంచిదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.దీంతో ఇప్పుడు ఎపిలో కూడా పేదలకు ఇళ్లు వరంగా మారనున్నాయి. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో పేదల ఇళ్ల నిర్మాణాలకు మంజూరైన నిధులను మధ్యవర్తులు, దళారులు పందికొక్కుల్లా మేశారు. అందుకు ఇప్పటి వరకు పథకలంఓ జరిగిన అక్రమాలే నిదర్శనం. దీనిపై తెలంగాణలో ఇప్పటికే సిబిసిఐడి విచారణ జరిగింది. అక్రమాలు వెలుగు చూశాయి. అందుకే గతంలో మాదిరి అక్రమాలు లేకుండా ఈ గృహాలను ప్రణాళికాబద్ధంగా నిర్మించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
హైదారబాద్,విజయవాడ, విశాఖ లాంటి మహానగరాల్లో మురికి కూపాల్లో ఉంటున్నవారంతా పల్లెల్లో బతకలేక పట్టణాలకు బతుకుతెరువు కోసం వచ్చినవారే. అలాంటి వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత పాలకులదే. వారికి ఉపాధి అవకాశాలు చూపిస్తూనే ఉండడానికి నీడ కల్పించాల్సిన భాధ్యత కూడా ఉంది. కానీ స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మురికవాడలు పెరుగుతున్నాయే తప్ప తగగ్గడం లేదు. కాగితాల్లో లక్షల ఇండ్లు నిర్మించినట్లు ఉన్నా అవి ఎక్కడున్నాయో తెలియదు. ప్రత్యేక తెలంగాణలో ఇప్పుడు ప్రజల కష్టాలు తెలిసిన సిఎం కెసిఆర్ వారికి ఇళ్లపథకం ప్రకటించి గౌరవంగా బతికే ఏర్పాటు
చేసి, ఆచరణలో తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఎపిలోనూ చంద్రబాబు కూడా ఇంటికలను సాకారం
చేయబోతున్‌ఆనరు. ఈ కల సాకారమైతే దేశంలో తెలుగు రాష్టాల్ల్రో పేదలు గర్వంగా బతుకుతున్న వారిగా చరిత్రలో నిలిచిపోతారు. మంచి పనులు చేసే అవకాశం కొన్ని సార్లు మాత్రమే వస్తుంది. లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం నిజంగా ఎంతో ఆనందకరమైనదిగా భావించాలి. నిజంగానే ఒకప్పుడు పథకాలన్ని పేదల పేరుచెప్పి పెద్దలు అనుభవించారు. పేదలకు పట్టాల పంపిణీ చేయడం ద్వారా వారికి పక్కా ఇళ్లు కేడా నిర్మించడమన్నది అంబేడ్కర్ స్ఫూర్తికి నిదర్శనంగా చెప్పాలి. అయితే గతంలో లాగా ఈ పథకం పక్కదారి పట్టకుండా ఇరు రాష్టాల్ల్రో పక్కాగా సాగాలి. తెలంగాణ పది జిల్లాల్లో పేదలు నివసించడానికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి తీరతామని కెసిఆర్ ప్రకటించారు. అలాగే ఎపిలో 13 జిల్లాల్లో కూడా ఇలాంటి పథకానికి పునాది పడింది. పేదలకు గూడు కల్పించి చరిత్ర సృష్టించకున్నా వారి జీవితాల్లో మాత్రం ఇద్దరు సిఎంలు చిరస్థాయిగా నిలిచిపోతారు. దీంతో రాష్టా ల నగర రూపురేఖలు కూడా మారుతాయి. ఇందుకు తొలి అడుగు మాత్రం తెలంగాణలో పడితే మలి అడుగు ఎపిలో పడింది. కేంద్రం కూడా నపేదలకు నిర్మించాలనుకుంటున్న ఇళ్ల విషయంలో రాష్టాల్రతో సమన్వయం చేసుకుని పక్కాగా చేపడితే దేశంలో పేదల సొంతింటి కల నెరవేరగలదు. మోడీ ప్రభుత్వం ఇందుకు కార్యాచరణచేసి ముందుకు సాగితే మ¬న్నతంగా అభివృద్ది సాధించగలం.