త్యాగాల ప్రతిరూపం భారత్‌

4
ప్రపంచశాంతి సైన్యంలో భారత్‌ యువకులదే అగ్రస్థానం

మేకిన్‌ ఇండియాకు ఎయిర్‌బస్‌ మద్దతు

రాఫె˜ల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు నిర్ణయం

తౌలోస్‌ (ఫ్రాన్స్‌): త్యాగాల ప్రతిరూపం భారతదేశం అని ప్రధాని నరేంద్రమోడి అన్నారు.

ఫ్రాన్స్‌ పర్యాటనలో ప్రవాసభారతీయులు ఇచ్చిన విందు అతిథ్యాన్ని స్వీకరించిన అనంతరం అయన మాట్లాడుతూ ప్రపంచ సైన్యంలో శాంతి కోసం నేలకోరిగిన వారిలో  భారత్‌ యువకులదే అగ్రస్థానమన్నారు. అంతకు ముందు  భారత ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమానికి ఫ్రాన్స్‌కు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ మద్దతు తెలిపింది. తాము భారత్‌లో తయారు చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తౌలోస్‌లోని ఎయిర్‌బస్‌ విమాన కర్మాగారాన్ని సందర్శించిన సందర్భంగా ఆ సంస్థ పై విధంగా స్పందించింది. సంస్థ సీఈఓ టామ్‌ ఎండర్స్‌ మోదీకి స్వాగతం పలికారు. కర్మాగారంలో ఎ380 ఎయిర్‌బస్‌ను తుదిగా రూపొందించే ప్రక్రియను మోదీ పరిశీలించారు. భారత్‌లో ప్రస్తుతం 4 ఎ380 విమానాలు ప్రతి రోజూ సేవలందిస్తున్నాయని ఈ సందర్భంగా టామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌తో బలమైన పారిశ్రామిక బంధాన్ని నెలకొల్పుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ”మోదీ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పిలుపుకు మేం మద్దతిస్తున్నాం. భారత్‌లో తయారు చేయటానికి మేం సిద్ధం” అని చెప్పారు.

భారత్‌లో ఎయిర్‌బస్‌ గ్రూపు సంస్థలు ప్రస్తుతం. పౌర విమానయానం, రక్షణ రంగాలకు సంబంధించి రెండు వేర్వేరు ఇంజనీరింగ్‌ కేంద్రాలను, ఒక పరిశోధన, సాంకేతికపరిజ్ఞానం (ఆర్‌ అండ్‌ టీ) కేంద్రాన్ని  నిర్వహిస్తోంది. వీటిలో ప్రస్తుతం 400 మందికి పైగా అత్యంత అర్హతలున్న వారు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలను విస్తరించాలన్న తమ నిర్ణయాన్ని టామ్‌ ఎండర్స్‌ వెల్లడించారు. విమానాలను తుదిగా అసెంబుల్‌ చేసే కర్మాగారాలను, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లకు సరఫరా సంస్థలు, సంబంధిత మౌలిక సదుపాయాలను నెలకొల్పాలని తాము భావిస్తున్నట్లు వివరించారు.

రఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు గొప్ప నిర్ణయం: పారికర్‌

రఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం గొప్ప నిర్ణయమని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌పారికర్‌ అన్నారు. రెండు సంవత్సరాల్లో రఫెల్‌ను వైమానిక దళంలో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. గత 17 ఏళ్లుగా కొలిక్కిరాని అంశంపై ప్రధాని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ విమానాల కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో మన వైమానిక బలం పెరుగుతుందన్నారు. ఇప్పుడున్న విమానాలకు తోడు వీటి రాక వల్ల మన రక్షణ వ్యవస్థ పటిష్టంగా మారుతుందన్నారు. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని రక్షణ రంగానికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తప్పుపట్టారు. రఫల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీ అహేతుకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో  పర్యటిస్తున్న మోదీ.. 36 రఫల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డస్సాల్ట్‌ ఏవియేషన్‌ సంస్థ రూపొందించే రఫల్‌ యుద్ధవిమానాలు అత్యంత పనికిమాలినవని, ప్రపంచంలోని మిగతా దేశాలేవీ ఆ విమానాలని కొనుగోలు చేసేందుకు ముందుకురాలేదని స్వామి చెప్పారు. ‘రఫల్‌ టైర్ల ఇంధన సామర్థ్యం చాలా తక్కువ. ఇక పనితీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పైగా మొదట ఆ డీల్‌ కుదుర్చుకుంది గత యూపీయే ప్రభుత్వం! వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆ యుద్ధవిమానాల్ని కొనొద్దని మోదీకి విన్నవిస్తున్నా’ అని అన్నారు. శనివారం ఢిల్లీలో విూడియాతో మాట్లాడిన ఆయన.. ఒకవేళ ఈ విషయంలో ప్రభుత్వ మొండిగా వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఒప్పంద పత్రాలు పరిశీలించిన అనంతరం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని చెప్పారు.