థర్మల్‌ ప్రాజెక్టులకు 15వేల కోట్ల రుణం

1
సీఎం సమక్షంలో ఫీఎఫ్‌సీతో ఒప్పందం

హైదరాబాద్‌,మార్చి 16(జనంసాక్షి):

రాష్ట్రంలో విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. ఆయన నిబ ద్ధతకు అనుగుణంగా భారీగా పెట్టుబడులు పెట్టేం దుకు పలు సంస్థలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు ఒప్పందాలపై ఆ సంస్థ సీఎండీ యం.కె.గోయల్‌, తెలంగాణ జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావు , జెన్‌ కో డైరెక్టర్‌ శ్రీనివాసరావు సంతకాలు చేశారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో హైద రాబాద్‌ బేగంపేటలోని

ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ ఒప్పందాలు జరిగాయి.పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సమకూర్చే ఈ రుణాన్ని నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,400 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం, ఖమ్మం జిల్లా మణుగూరు సవిూపంలో ఏర్పాటు చేసే 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వినియోగిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు రుణంపై వడ్డీని 12 శాతం నుంచి 11.5 శాతానికి పి.ఎఫ్‌.సి తగ్గించింది.