దాశరథికి కన్నీటి వీడ్కోలు

C
-ప్రభుత్వ లాంఛనాలతో అంత్య క్రియలు

హైదరాబాద్‌,జూన్‌9(జనంసాక్షి):

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీ శిఖరం దాశరథి రంగాచార్య అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌ పల్లిలోని శ్మశాన వాటికలో, అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన ఉమారుడు విరించి చితికి నిప్పంటించారు. దాశరథిని కడసారి చూసేందుకు అభిమానులు, మేధావులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా దాశరథి వారసత్వాన్ని కొనసాగిస్తామని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని నినదించారు. కడసారి చూపులకు సాహితీవేత్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, గద్దర్‌, సుద్దాల అశోక్‌తేజ తదితరులు దాశారథి అంత్యక్రియలకు హాజరయ్యారు. రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలలు,  శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించిన గొప్ప వ్యక్తి దాశరథి రంగాచార్యులు. సోమవారం ఉదయం ఆయన చికిత్స పొందుతూ నగరంలో మృతి చెందారు.