దాసరి ఆస్తుల అటాచ్‌కు ఈడీ యత్నాలు
న్యూఢిల్లీ,మార్చిమార్చి 23 (జనంసాక్షి): సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధమైంది. బొగ్గు కుంభకోణం కేసులో దాసరి నారాయణరావు నిందితుడిగా ఉన్నాడు. జార్ఖండ్‌లో జిందాల్ కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపుల్లో దాసరి నారాయణరావు పాత్రమై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేసింది. దాసరికి ముడుపులు అందినట్లుగా చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. దాసరి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ కసరత్తు చేస్తుంది. అప్పట్లో ఆయన బొగ్‌ఉశౄఖ సహాయమంత్రిగా ఉన్నారు. జార్ఖండ్‌లో జిందాల్ కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపుల్లో దాసరి నారాయణరావు పాత్రపై సీబీఐ, ఎన్‌ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మన్మోహన్ హయాంలో బొగ్గు శాఖకు సహాయ మంత్రిగా దాసరి పనిచేసిన సంగతి తెలిసిందే. 2008లో జార్ఖండ్ లో జిందాల్ కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ నిర్ధారించింది. ఏ విధంగా కేటాయింపులు చేశారనే దానిపై గతంలో దాసరిని సీబీఐ ప్రశ్నించింది. పూర్తిస్థాయి వివరాలు ఇవ్వకుండా బొగ్గు క్షేత్రాలు పొందినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. దాసరికి చెందిన సంస్థల్లో ముడుపులు చేరినట్లు సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనితో దాసరికి చెందిన 2.25 కోట్ల ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈడీ ఆస్తులను జప్తు చేస్తుందని తెలుస్తోంది. దాసరికి చెందిన సౌభాగ్య విూడియాకు ఈ నిధులు మళ్ళించినట్లు గుర్తించారు.