దుమ్ముగూడెం ఆనకట్టను కూల్చివేస్తున్న అధికారులు

ఖమ్మం: దుమ్ముగూడెం వద్ద గోదావరిపై కాటన్‌ దొర నిర్మించిప ఆనకట్టను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ అనకట్టను 1850లో సర్‌ ఆర్థన్‌ కాటన్‌ దొర నిర్మించారు. దీన్ని ఇప్పుడు జల విద్యుత్‌ప్రాజెక్టు అధికారులు కూల్చివేస్తున్నారు. పురాతన కట్టడాలకు హాని కలిగించకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాలని 2008లో కేంద్రప్రభుత్వం జీవో జారీ చేసినా దాన్ని అధికారులు భేఖాతరు చేసి కూల్చివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కట్టడాన్ని కూల్చివేయడంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.