నిండుకుండలా నాగార్జునసాగర్..
` 8 గేట్ల ద్వారా నీటి విడుదల
నాగార్జునసాగర్(జనంసాక్షి): కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండగా.. అక్కడి నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం అంతే నీటిమట్టం ఉంది. 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1.09 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.