దుమ్మ గూడ గ్రామంలో త్రాగు నీటి ఎద్దడి.

మూలకు చేరిన చేతిబోర్లు,విద్యుత్ మోటార్ బోర్లు..
కలుషితమవుతున్న బావి నీరే వీరికి గతి ..
సంబంధిత అధికారులు కి వేడుకలు..
డుంబ్రిగుడ(ఫిబ్రవరి 16 జనం సాక్షి)మండలంలోని అరమ పంచాయితీ దుమ్మగుడ గ్రామంలో త్రాగు నీటి ఎద్దడి అధికంగా వేధిస్తోందని ఆయా గ్రామస్తులు కలిసి గిరిజన సంఘం నాయకులకు చరవాణి ద్వారా సమాచారం చేరవేయడంతో స్పందించి సంఘం రాష్ట్ర కమిటీ నాయకుడు టి.సూర్యనారాయణ సభ్యులతో కలిసి బుధవారం ఆ గ్రామంలో సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యలు గ్రామస్తులతో సమావేశమై అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 60 కుటుంబాలు 450 మంది జనాభా కలిగిన గ్రామంలో పాతబడ్డ బావి నీరే వీరికి ఆధారం అన్నారు.ప్రస్తుతం బావిలో కూడా మంచినీరు అడుగంటి పోవడంతో గ్రామస్తులు కొండ జోరే వాగు నీరే అత్యవసర లకు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.ఆ నీరు కూడా వేసవి సమీపిస్తుండటంతో ఇంకిపోయి అడుగంటి పోతుండటంతో గ్రామస్తులకు త్రాగు నీరు అందక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు.గ్రామంలో లక్షల వ్యయంతో నిర్మించిన విద్యుత్ బోరు మరమ్మత్తు కి గురై వినియోగం లేకుండా నిరుపయోగంగా దర్శనం ఇస్తుందని తెలిపారు.సంబంధిత మండల అధికారులు పర్యవేక్షణ లేకపోవటంతోనే ఇటువంటి సమస్య గ్రామాల్లో ఉత్పన్నమవుతుందని మండిపడ్డారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఐటిడిఎ పిఓ స్పందించి త్రాగునీరు కొరత ఉన్న గ్రామాలను గుర్తించి తాగునీటి సదుపాయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కె.జగబందు,కె.జొయ్యో,పి.కృష్ణ,పి.లక్ష్మి,జి.రాధా,పి.కుమారి.గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.