దూలికట్టలో ప్రబలిన అతిసారం
శాంతినగర్:(దూలికట్ట): కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం దూలికట్ట గ్రామంలో అతిసార ప్రబలుతోంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. ఈ ఘటనతో గత వారం రోజుల్లో అతిసారంతో మృతి చెందిన వారి సంఖ్య నలుగురికి చేరింది. మరోవైపు గ్రామానికి చెందిన మరో 15 మంది పెద్దపల్లి, సుల్తానాబాద్, కరీంనగర్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దూలికట్ట గ్రామంలో తాగునీటి కలుషితం వల్ల అతిసారం వ్యాపిస్తోందని.. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారులు గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.