దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు

1

న్యూఢిల్లీ,మార్చి22(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ¬లీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నా-పెద్ద, ధనిక-పేద, ఆడమగ తేడా లేకుండా ¬లీ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేశరాజధాని ఢిల్లీ, ఆర్థికరాజధాని ముంబై, కోల్‌కతా,అహ్మదాబాద్‌ తదితర పట్టణాల్లో ¬లీ అంబరాన్ని అంటింది. ఇక్కడ ఉన్నవారు పెద్ద ఎత్తున ¬లీ ఆడారు. రంగుల్లో మునిగారు.  ఉజ్జయినిలోని మహాంకాళి ఆలయంలో ¬లీ సందర్భంగా ప్రత్యేక భస్మహారతి నిర్వహించారు. తర్వాత శివలింగంపై రంగులు చల్లారు.  బీహార్‌ గయాలో ¬లీ వేడుకలు ఘనంగా జరిగాయి. అనేక కాలనీల్లో జనం ఉల్లాసంగా రంగులు చల్లుకుంటూ కనిపించారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే ¬లీని జాలీగా నిర్వహిస్తామని జనం చెప్పుకున్నారు.  పశ్చిమబెంగాల్‌ శిలిగురిలో ¬లీ వేడుకలకు వందలాది మంది హాజరయ్యారు. జనం డప్పులు వాయిస్తూ పాటలు పాడారు. ఈ ¬లీ వేడుకలో పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఢిల్లీలోని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్‌ నివాసంలో ¬లీ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ ప్రజలందరికీ ఆయన ¬లీ శుభాకాంక్షలు తెలియజేశారు.  తమిళనాడు కోయంబత్తూరులో ¬లీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుజరాతీ సమాజ్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. అమ్మవారికి పూజలు నిర్వహించి వేడుకలు జరిపారు. గుజరాతీలో ఎక్కడున్నా స్థానిక ప్రజలతో కలిసిపోతామని చెప్పుకున్నారు.

జమ్మూకశ్మీర్‌ పూంచ్‌లో సైనికులు స్థానికులు కలిసి ¬లీ వేడుకలు నిర్వహించారు. రంగులు చల్లుకున్నారు. బాలీవుడ్‌ పాటలకు స్టెప్పులు వేస్తూ ఉల్లాసంగా గడిపారు. అటు రచౌరీలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ¬లీ వేడుకలు జరుపుకున్నారు. డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్‌ చేశారు.  స్పైస్‌ జెట్‌ సిబ్బంది తమ విమానంలో ¬లీ వేడుకలు నిర్వహించి ప్రయాణికులను అలరించారు. డ్యాన్సులు వేస్తూ పాటలు పాడారు. గతేడాది కూడా విమానంలోనే ¬లీ నిర్వహించినట్లు తెలిపారు.  మధురలో ¬లీ వేడుకలు ఘనంగా జరిగాయి. బంకేబిహారీ ఆలయం దగ్గర వేలాది మంది ¬లీ జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ¬లీ వేడుకలు

¬లీ సంబరాల్లో మునిగితేలారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ వేడుకలు జరుపుకున్నారు.రెండు తెలుగు రాష్టాల్ల్రో ¬లీ వేడుకలు ఉత్సాహంగా, ఆనందపూరిత వాతావరణంలో జరిగాయి. ప్రజలు, ప్రముఖులు ఇళ్లనుంచి బయటకు వచ్చి రంగుల్లో మునిగి తేలారు. ఒకిరినొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా యువత కేరింతలు కొడుతూ రంగుల్లో మునిగి పోయారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ,  విద్యార్థులు ¬లీ  వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బిజెపి కార్యాలయంలో జరిగిన ¬లీ వేడుకల్లో దత్తాత్రేయ పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలు ఆయనకు రంగుపూసి నృత్యం చేశరాఉ. ఈ సందర్భంగా ప్రజలకు ¬లీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు రంగులు పూసి ఎంజాయ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ¬లీ వేడుకల్లో భాగంగా మోండాలో  జరిగిన ¬లీ వేడుకల్లో పాల్గొన్నారు. అందరితో కలిసి ఆడుతూ… పాడుతూ ఆకట్టుకున్నారు.  హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ¬లీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. యువత పెద్ద ఎత్తున చేరుకోవడంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ¬లీ వేడుకలు ఘనంగా జరిగాయి. టిడిపి అధినేత, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా నేతలు ¬లీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు డప్పుకొట్టి.. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. తెదేపా నేతలు రమేష్‌రాథోడ్‌, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ¬లీ ప్రజలకు ఆనందాన్ని ఇచ్చే వేడుకని చంద్రబాబు అన్నారు. ఇది అందరి జీవితాల్లో రంగులు నింపాలని కోరుకున్నారు. ఇదిలావుంటే నగరంలోని బేగంపేట దేవ్‌నగర్‌ బ్లైండ్‌ స్కూల్‌లో ¬లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పలువురు విదేశీయులు పాల్గొని సందడి చేశారు. చిన్నారులు ఉత్సవాహంగా విమానంలో ¬లీ సంబరాలు

విమనాంలో ¬లీ వేడుకలు వినడానికి వింతగా ఉన్నా ప్రయాణికులు మాత్రం ఎంజాయ్‌ చేశారు. మరికొద్దిసేపట్లో విమానం బయలుదేరుతుందనగా ప్రయాణికులంతా సంతోషంగా ¬లీ జరుపుకొన్నారు. దిల్లీ నుంచి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానం మరి కొద్ది సేపట్లో టేకాఫ్‌ అవుతుందనగా ప్రయాణికులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. విమానంలో ఇలాంటి సంబరాలు జరుపుకొంటామని సిబ్బందిగత నెలలో అధికారులను కోరగా అందుకు డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) ఒప్పుకోలేదు. అయితే టేకాఫ్‌కి ముందు ఇలాంటి సంబరాలు జరుపుకోవచ్చని అనుమతి ఇచ్చింది. దీనిని ప్రయాణికిఉలు బాగా ఆస్వాదించారు. తనెలలో ప్రముఖ గాయకుడు సోనూనిగమ్‌ విమానంలోని పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టమ్‌తో పాటలు పాడాడు. దీంతో అతనికి సహకరించిన సిబ్బందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో ¬లీ అనుమతులకు కొంత టెన్షన్‌ జోడించారు.