నగర అభివృద్ధిలో భాగస్వామ్యంకండి

4

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి):పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరిని హైదరాబాద్‌ నగరాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ శివార్లలోని ప్రగతి రిసార్ట్స్‌ లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల రెండు రోజుల శిక్షణా శిబిరం ముగింపులో ఆయన మాట్లాడారు. ఇక నుంచి ప్రతి వారం స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ కార్పొరేటర్లకు సూచించారు. ప్రతీ 15 రోజులకొకసారి డివిజన్‌ స్థాయి సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణంలో అహ్మదాబాద్‌ ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే ఒక బృందాన్ని అక్కడికి పంపి మరింత అవగాహన పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని కేటీఆర్‌ చెప్పారు.ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దిన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధనరెడ్డి, హెచ్‌ఎండీఎ అధికారులు తదితరులు పాల్గొన్నారు.