నడిరోడ్డుపై అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకం

– సిమెంట్ రోడ్డును పగలగొట్టిన గ్రామస్థుడు
– సమస్యను విన్నవించుకున్న పట్టించుకోని అధికారులు
అనంతగిరి జనంసాక్షి:ఎటువంటి అనుమతి లేకుండా అంతర్గత సిమెంట్ రోడ్డును అక్రమంగా రోడ్డు నడి మధ్యలో గ్రామానికి చెందిన బద్దం వెంకటరెడ్డి పగలగొట్టారని గ్రామానికి చెందిన బద్దం బాలకృష్ణారెడ్డి ఆరోపించారు.ఇదే విషయమై అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం 3వ వార్డులో సిమెంట్ రోడ్డు నిర్మించిందని,ఇంట్లో వాడిన మురికి నీరు,గత రెండు రోజులకు కురుస్తున్న వర్షపు నీరు రోడ్డుపై నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు.ఇదే నెపముతో ఎదురుగా ఉంటున్న వెంకటరెడ్డి నాపై వాదన వేసుకొని రోడ్డును అడ్డంగా తవ్వారని ఆయన పేర్కొన్నారు.అధికారులకు,ప్రజా ప్రతినిధులకు చెప్పిన పట్టించుకోవటం లేదని వాపోయారు.ఇదే విషయమై వెంకట్ రెడ్డిని వివరణ అడగగా బాలకృష్ణారెడ్డి తన ఇంటి ముందు ఇంటి నిర్మాణానికి వినియోగించే బండరాళ్ళను కుప్పగా పేర్చారని,దీంతో ద్విచక్ర వాహనాలు,పాఠశాల వాహనాలు తమ ఇంటి ఆవరణ మీదుగా వెళుతున్నాయని,రాళ్లు ఇంట్లోకి వెళ్లే వాహనాలకు అడ్డుగా ఉంటున్నాయని వెంటనే రాళ్ళను తొలగించాలని పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు.ఇదే విషయమై కార్యదర్శిని వివరణ అడగగా సిమెంట్ రోడ్డును పగలగొట్టిన విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని వారి ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.