నలుగురు మంత్రుల శాఖల మార్పు
కేటీఆర్‌కు ప్రమోషన్, తలసానికి డిమోషన్
హైదరాబాద్,ఏప్రిల్25(జనంసాక్షి):
రాష్ట్ర మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు చోటుఎ చేసుకున్నాయి. ఈ మార్పులతో మరోమారు సిఎం కెసిఆర్ తన తనయుడు కెటి రామారావుకు ప్రాధాన్యం పెంచారు. ఆయనకు కీలకమైన శాఖలు అప్పగించారు. సిఎం కెసిఆర్ చేపట్టిన మార్పులు చేర్పులకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. సీఎం కేసీఆర్ వద్ద ఉన్న శాఖలతో పాటు వాణిజ్య పన్నులు, గ్రావిూణ నీటి సరఫరా అదనంగా ఉండనున్నాయి. కేటీఆర్‌కు ఐటీ, పురపాలక సహా పరిశ్రమలు, మైనింగ్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు అప్పగించారు. తలసానికి శ్రీనివాస్‌యాదవ్‌కు పశు సంవర్ధక, మత్స్య, డెయిరీ, సినిమాటోగ్రఫీ శాఖలు, కేటాయించారు. జూపల్లి కృష్ణారావుకు పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖలు, పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయంతో పాటు సహకార శాఖను అప్పగించారు. ఇప్పటి వరకు వాణిజ్యపన్నుల శౄఖను నిర్వహించిన తలసానికి ప్రాధాన్యం తగ్గించారు. దీనిని సిఎం స్వయంగా తనవద్దే ఉంచుకోవడం విశేషం. ఇక హరీష్ రావు ద్దగర ఉన్నమైనింగ్ శాఖను కూడా కెటిఆర్‌కు అప్పగించారు. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు, చేర్పులకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించారు. మంత్రివర్గంలో నలుగురి శాఖల్లో మార్పు, చేర్పులు జరిగాయి. సీఎం వద్ద ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు వాణిజ్య పన్నులు, గ్రావిూణ నీటి సరఫరాశాఖలు వచ్చి చేరాయి. కాగా పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయంతో పాటు సహకారశాఖ అప్పగించారు. జూపల్లి కృష్ణారావుకు పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి… కేటీఆర్‌కు ఐటీ, పురపాలక, పరిశ్రమలు, గనులు, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు.. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు పశుసంవర్థక, మత్స్య, డెయిరీ, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు. ఇదిలావుంటే తనకు కేటాయించిన గనుల శాఖను వేరేవారికి అప్పగించాల్సిందిగా మంత్రి హరీశ్ రావు, సీఎం కేసీఆర్‌ను కోరారు. ఇరిగేషన్, మిషన్ కాకతీయ, మార్కెటింగ్, అసెంబ్లీ వ్యవహారాలతో పనిభారం ఎక్కువైందని, ఈ నేపథ్యంలో గనుల శాఖను వేరేవారికి అప్పగించాలని సీఎంకు విజ్జప్తి చేశారు. మొత్తంగా ఆయా వ్వయహారాలను పరిశీలించిన సిఎం పోచారంనకు అదనంగా సహకార శాఖ అప్పగించడంతో ఆయన బాధ్యతలను కూడా పెంచారు. మొత్తంగా కెటిఆర్‌కు ప్రాధాన్యం పెరిగి ప్రధాన సిఎం తరవాత ప్రధాన శాఖలు ఆయనకు చేరాయి. రాష్ట్ర ఖజానాకు ప్రధాన వనరైన వాణిజ్య పన్నుల శాఖను సీఎం కేసీఆర్ తన వద్దనే ఉంచుకున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఏ పరిస్థితుల్లోనూ నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి దానిని పంచాయతీరాజ్ శాఖ నుంచి విడదీసి తన చేతిలోకి తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు తన చేతిలో ఉంటేనే అధికారులను దౌడు తీయించవచ్చునన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమను పరుగులు పెట్టిస్తున్న ఆ శాఖ మంత్రి కే తారకరామారావుకు ఇటీవలే పురపాలకశాఖను అప్పగించారు. నగరాలు, పట్టాణాల అభివృద్ధిలో కీలకమైనవి పరిశ్రమలు.. కనుక పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖలు ఒకే మంత్రి వద్ద ఉంటే మరింత మెరుగైన ఫలితాలుంటాయని సిఎం ఆలోచించినట్టు తెలిసింది. అలాగే మంత్రి కేటీఆర్ వద్ద ఉన్న పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖను జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. అలాగే రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరైన వాణిజ్యపన్నుల శాఖను కూడా ముఖ్యమంత్రి తన ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకాలు, కొత్త దవాఖానల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను సర్కారు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. వీటన్నింటికీ కావాల్సిన నిధులు వాణిజ్య పన్నుల ద్వారానే సమకూర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులతో నిత్యం సవిూక్షలు నిర్వహించి, పకడ్బందీగా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచడానికి, పన్ను వసూళ్లను నూటికి నూరు శాతం రాబట్టే ఆలోచనతో వాణిజ్య పన్నుల శాఖను చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ శాఖను చూస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సినిమాటోగ్రఫీతో ఇతర శాఖలను అప్పగించారు. శాఖలను మార్చడం ద్వారా పాలనలో వేగం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.