నల్లకుంట ఆసుపత్రికి ‘ఫీవర్‌’

C

సీఎం ఆకస్మిక తనిఖీలు

స్వైన్‌ ఫ్లూ వార్డులు కొనసాగించండి

ఆసుపత్రిని ఆధునీకరిస్తాం

సీఎం కేసీఆర్‌ హామీ

హైదరాబాద్‌,ఏప్రిల్‌11(జనంసాక్షి):  హైదరాబాద్‌ నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ వార్డులను పరిశీలించి రోగులను పరామర్శించారు. ఆస్పత్రి అంతా కలియతిరిగారు. వార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వెనుక భాగంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆయన పరిశీలించి అక్కడ ఉన్న చెత్తను శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. కాగా, ఆస్పత్రి పరిశుభ్రంగా ఉండటంతో సీఎం తన ఆకస్మిక తనిఖీ విషయం ఏమైనా తెలిసి శుభ్రం చేశారా ? అని అధికారులను కేసీఆర్‌ అడిగారు. ఆసుపత్రి నిర్వహణపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్‌, ఆర్‌ఎం అందుబాటులో లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వైన్‌ఫ్లొ వార్డును కొనసాగించాలని సీఎం ఆదేశించారు. ఆసుపత్రిని ఆధునీకరిస్తామనిసీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.    ఇదే సమయంలో ఆస్పత్రి సూపరిండెంట్‌, ఆర్‌ఎమ్‌లు సెలవులో ఉండటంతో అధికారులందరూ సెలవులో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. కాగా, ఈ సమయంలో సీఎంతో పాటు ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టరు నిర్మల ఉన్నారు. అంబర్‌పేటలో జరిగిన మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలో పాల్గొన్న సీఎం అనంతరం నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించి, ఆవరణను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో గల సౌకర్యాలపై వైద్యులను ఆరా తీశారు.