నల్లదొంగల గుట్టురట్టు
– బట్టబయలు చేసిన ఐసీఐజే
– విదేశీ ప్రముఖులతో పాటు అమితాబ్, ఐశ్వర్య
న్యూఢిల్లీ,ఏప్రిల్ 4(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా అవినీతిపరుల జాబితా ఒకటి విడుదల కావడంతో ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ నల్లధనం కుబేరుల బాగోతం బట్టబయలైంది. పన్నులు ఎగ్గొడుతూ కోట్లకొద్ది సంపదను అక్రమంగా కూడబెతున్న వారిలో దేశాధినేతలు.. ప్రపంచస్థాయి నాయకులు.. సెలబ్రిటీలు ఉన్నట్లు వివరాలు బహిర్గతమయ్యాయి. అందుకు సంబంధించిన దాదాపు కోటీ 15 లక్షల రహస్య పత్రాలు పనామాకు చెందిన ప్రముఖ గూఢాచార సంస్థ మొస్సాక్ ఫోన్సీకా నుంచి లీకయ్యాయి. నల్లధనం కుబేరుల వివరాలు బహిర్గతం చేసి ‘పనామాపేపర్స్’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీలో 1100 మంది భారతీయులకు రహస్య ఖాతాలు ఉన్నట్టు గత ఏడాది లీకైన స్వీస్ పత్రాలు వెల్లడించి, సంచలనం సృష్టించగా తాజాగా వెల్లడైన పనామా పత్రాలు పెనుదుమారం రేపుతున్నాయి. దాదాపు 500 మంది భారతీయుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయి. వారు పన్ను ఎగ్గొటి తమ నల్లడబ్బును దాచుకునేందుకు విదేశాల్లో బూటకపు కంపెనీలు, ఫౌండేషన్లు, ట్రస్టులు ఏర్పాటుచేసినట్టు వెల్లడైంది. నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్ ఫొన్సెకాకు చెందిన కోటి11 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు ఏర్పాటు చేయడంలో దిట్టగా పేరొందిన ఈ లా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. నల్లడబ్బు సర్గధామలైన దేశాల్లో కంపెనీలు స్థాపించి.. తద్వారా పన్ను ఎగ్గొట్టేందుకు ఈ కంపెనీకి పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు డబ్బు చెల్లించినట్టు ఈ పత్రాల్లో వెల్లడైంది. వివిధ దేశాధినేతలు.. ప్రముఖ నాయకులు.. సెలెబ్రిటీలతోపాటు.. భారత్‌కు చెందిన 500 మంది నల్లధనం కుబేరులు ఉన్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ 500 మంది ఎవరన్న విషయంపై సోషల్ విూడియాతో పాటు.. పలు విూడియా సంస్థలు వివరాలు వెల్లడిస్తున్నాయి. అందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సన్నిహితులు.. హాలీవుడ్ నటుడు జాకీచాన్ సహా.. 500మంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది పాటు ఈ పత్రాలను పరిశోధించిన అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కన్సార్టియం (ఐసీఐజే) తాజాగా బహిర్గతం చేసింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన 140 మంది రాజకీయ నాయకులు.. 12 మంది తాజా మాజీ దేశాధినేతలు ఉన్నారు. మనీ లాండరింగ్.. పన్ను ఎగవేతకు పాల్పడుతూ అక్రమంగా కూడబెట్టిన నల్లధనానికి సంబంధించి 2,14000 సంస్థలకు చెందిన 11.5మిలియన్ల రహస్య పత్రాలు లీకైనట్లు ‘పనామా పేపర్స్’ వెబ్‌సైట్ వెల్లడించింది. పెద్ద ఎత్తున లీకైనా పత్రాలలో రష్యా అధ్యక్షుడి పేరు నేరుగా లేకపోయినా.. బినావిూలు.. సన్నిహితుల ద్వారా హవాలా సొమ్మును భారీ మొత్తంలో విదేశాల్లో కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఆ డబ్బంతా వేరే మార్గాల్లో తిరిగి పుతిన్‌కు చేరినట్లు వివిధ సంస్థల పరిశోధనల్లో తేలినట్లు సమాచారం. తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం 500 మంది భారతీయుల పేర్లలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్.. ఐశ్వర్యారాయ్ ఉండటం సంచలనంగా మారింది. వీరితోపాటు ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ.. ఇండియా బుల్స్ యజమాని సవిూర్ గుప్తా.. డీఎల్‌ఎఫ్ ప్రమోటర్ కేపీ సింగ్‌లు ఉన్నట్లు చెబుతున్నారు. దిల్లీ లోక్‌సత్తా పార్టీ మాజీ చీఫ్ అనురాగ్ కేజీవ్రాల్.. పశ్చిమ్ బంగా రాజకీయ నాయకుడు శిశిర్ బజోరాల పేర్లు బయటకు వచ్చాయి. మిగిలిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇందులో 500 మంది భారతీయుల పేర్లు ఉండగా, 234 మంది భారతీయులు ఈ కంపెనీల ఏర్పాటు కోసం తమ పాస్‌పోర్టులను కూడా సమర్పించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఈ పత్రాలను పరిశీలించి వెల్లడించింది. ఐశ్యర్య రాయ్, ఆమె తండ్రి రమణరాజ్ కృష్ణరాయ్, తల్లి విందాకృష్ణ రాజ్ రాయ్, సోదరుడు ఆదిత్య రాయ్ డైరెక్టర్లుగా 2005లో ఎమిక్ పార్టనర్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. మొదట ఈ కంపెనీకి ఐశ్యర్య డైరెక్టర్‌గా ఉండగా, తర్వాత షేర్ ¬ల్డర్‌గా మారిపోయారు. 2008లో ఈ కంపెనీ రద్దయింది. నీసం విదేశీ నాలుగు షిప్పింగ్ కంపెనీల్లో అమితాబ్ బచ్చన్ డైరెక్టర్‌గా ఉన్నట్టు ఈ పత్రాలు వెల్లడించాయి. ఇందులో ఒకటి బీవీఐలో ఉండగా, మరో మూడు బహమస్‌లో ఉన్నట్టు తేలింది. 1993లో స్థాపించిన ఈ కంపెనీల మూలధనం కేవలం 5వేల నుంచి 50వేల డాలర్లు కాగా, ఇవి చేసే ఓడల వ్యాపారం కోట్ల డాలర్లలో ఉండేది.
నల్లధనం దాచుకున్న వారిపై చర్యలు తప్పవు: జైట్లీ
విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్న భారతీయులపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పన్నుఉల ఎగవేసే దారులను వదలబోమని అన్నారు. గత ఏడాది తమ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను బేఖాతరు చేసిన వ్యక్తులకు కష్టాలు తప్పవన్నారు. పనామా పేపర్స్ ద్వారా లీకైన నల్లధనం కుబేరుల జాబితాలో దాదాపు 500 మంది భారతీయులున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. నల్లధనం వివరాలు బయటపెట్టకుండా, పన్నులు కట్టకుండా ఇలాంటి పనులు చేస్తున్న వారు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని రుజువవుతుందని జైట్లీ హెచ్చరించారు. విదేశాల్లో దాచుకున్న అక్రమ డబ్బును వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన కొత్త చట్టం వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం వివరాలు స్వచ్ఛందంగా వెల్లడించాలంటూ ప్రభుత్వం గత ఏడాది ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కొంతమేరకు నల్లధనం బయటపడింది. విదేశాల్లో ఉన్న నల్లధనం బయటపెట్టాలని అవకాశం ఇచ్చినా చాలా మంది వినియోగించుకోలేదని, ఇలాంటి వారు తప్పక మూల్యం చెల్లిస్తారని జైట్లీ అన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం బయటపెట్టేందుకు 2017లో కఠిన చర్యలు తీసుకుంటామని.. అప్పుడు ఆస్తులను దాచి పెట్టడం చాలా కష్టమని జైట్లీ సీఐఐ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ స్పష్టంచేశారు.
పనామా దేశంలోని మొసాక్ ఫోన్సెకా అనే సంస్థ నుంచి దాదాపు కోటీ 15 లక్షల రహస్య పత్రాలు లీకైన సంగతి తెలిసిందే. ఇందులో పన్నులు ఎగ్గొడుతూ కోట్ల కొద్దీ సంపదను కూడబెడుతున్న దేశాధినేతలు.. సెలబ్రిటీల వివరాలూ వెల్లడయ్యాయి. ఈ జాబితాలో 500 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం.
సంచలనం సృష్టిస్తున్న పనామా పేపర్స్ లీక్స్‌లో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను ఐశ్వర్య విూడియా సలహాదారు అర్చనా సదానంద్ ఖండించారు. ఆ డాక్యుమెంట్లన్నీ అబద్ధమని, వాటిల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. లీకైన వివరాల ప్రకారం ఐశ్వర్యారాయ్ విదేశంలో ఉన్న ఓ కంపెనీ డైరెక్టర్‌గా, షేర్¬ల్డర్‌గా ఉన్నారని.. దానిని 2008లో మూసేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ఇందులో వాస్తవం లేదని ఐశ్వర్య విూడియా అడ్వైజర్ అన్నారు. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ పరిశోధనలో లీకైన లక్షలాది డాక్యుమెంట్స్ ద్వారా నల్లధనం అక్రమంగా కూడబెట్టిన వందలాది మంది వివరాలు బయటపడినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారిలో వివిధ దేశాల నేతలు, సెలబ్రిటీల పేర్లతోపాటు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ పేర్లు కూడా ఉన్నాయి. లీకైన డాక్యుమెంట్ల ప్రకారం నల్లధనం కుబేరుల్లో 500 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. ఈ ఆరోపణలపై అమితాబ్‌బచ్చన్ ఇప్పటివరకు స్పందించలేదు.
పనామా పేపర్స్’పై దర్యాప్తు చేస్తాం: ¬లాండే
పారిస్,ఏప్రిల్4(ఆర్‌ఎన్‌ఎ): పనామాపేపర్స్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం బయటపడిన వ్యహారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ¬లాండే స్పందించారు. పనామా పేపర్స్ ఘటనపై ఫ్రాన్స్ తప్పకుండా దర్యాప్తు చేపడుతుందని ఆయన హావిూ ఇచ్చారు. ఈ కేసులో చట్టపరమైన విచారణ చేపడతామన్నారు. అంతేగాక.. పనామా పేపర్స్ పేరుతో ఇంత భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన వారికి హళలాండే ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం బయటపడింది. పన్నులు ఎగ్గొట్టి లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా దాచుకుంటున్న ప్రపంచ ప్రముఖుల వివరాలతో కూడిన రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. పనామా పేపర్స్ పేరుతో వెల్లడైన ఈ వివరాల్లో కొందరు దేశాధినేతల సన్నిహితులతో పాటు 500 మంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.