నా నోబెల్‌ బహుమతి దేశానికి అంకితం

2

– పిల్లల్ని పనికి పంపడం బాధాకరం

– సత్యార్థి ప్రకాష్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి): నోబెల్‌ బహుమతిని దేశానికి, ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉందని  . దేశంలో పిల్లలను పనికి పంపే తల్లిదండ్రులు ఉండడం బాధాకరమని నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విూడియాతో మాట్లాడారు. బాలకార్మిక చట్టాలు భారత్‌లో కఠినంగానే ఉన్నాయన్నారు. కానీ అమలులో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. అక్షరాస్యత వల్లే ఇతర దేశాలు వేగంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. అయితే మనదేశంలో పిల్లల చదవులపై పెద్దగా బాధ్యత తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎందరో బాల్యం బుగ్గిపాలవుతోందన్నారు. తనకు నోబెల్‌ బహముతి వచ్చిందని మిత్రుడు చెబితే నమ్మలేక పోయానన్నారు. కేవలం పత్రిక నడుపుతూ ఉంటే నోబెల్‌ వచ్చేది కాదేమోనన్నారు. నోబెల్‌ బహుమతి నా వద్దే ఉంచుకోలేనని రాష్ట్రపతికి లేఖ రాసినట్లు కైలాష్‌ సత్యార్థి తెలిపారు.  పిల్లలతో కలసి పనిచేయడం వారిని స్కూల్ళకు పంపడం ఆనందంగా ఉందన్నారు. ఇంతకన్నా ఆనందం మరోటి లేదన్నారు. ప్రతి ఒక్కరూ పిల్లలకు అండగా ఉండి వారి బాల్యం బాగుపడేలా చూడాలన్నారు.