నిజాం షుగర్స్‌పై సిఎం స్పష్టత ఇవ్వాలి
నిజామాబాద్,మార్చి31(జనంసాక్షి): జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ స్వాధీనంపై స్పష్టత ఇవ్వాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంషుగర్స్ నిర్వహణ గురించి మరిచారా? అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన వంద రోజులకు పరిశ్రమలను ప్రభుత్వపరం చేస్తామని పలుమార్లు ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. నిజాం దక్కన్ షుగర్స్ లేఆఫ్ చేయడానికి ముడిసరుకు చెరకు లేకపోవడం కారణమని ప్రైవేటు యాజమాన్యం చెప్పడం కార్మికులు, కర్షకులను మోసం చేయడమేనని రక్షణ కమిటీ నేతలు ఆరోపించారు. కరవు పరిస్థితి ఉన్నందున రైతులు చెరకు పండించలేదని దీనిని సాకుగా చూపి ప్రకటన చేయడం సరికాదన్నారు. రైతుల సంక్షేమం కోరి వెంటనే దీనిని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. చెరకు అందుబాటులో లేకపోవడం వల్ల్నే చక్కెర పరిశ్రమకు లేఆఫ్ ప్రకటించామని యాజమాన్యం బీఐఎఫ్‌ఆర్‌కు నివేదించడం శుద్ధ తప్పన్నారు. ఈ సీజన్ కోసం రైతులు 2.60 లక్షల చెరకు సాగు చేశారని, ఆ చెరకును ఇతర కర్మాగారాలకు మళ్లించడానికి ప్రభుత్వం రూ.7 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆ డబ్బును కర్మాగారాల మరమ్మతులకు వెచ్చిస్తే సీజన్ నడిచేదన్నారు. అబద్దాలు ప్రచారం చేస్తున్న ప్రైవేటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హావిూలు నెరవేర్చామని చెబుతున్న సిఎం నిజాం షుగర్స్‌ను వసి/-మరించడం తగదన్నారు. ప్రైవేటు యాజమాన్యం ప్రభుత్వ ఆమోదంలేకుండా లేఆఫ్ ఎలా ప్రకటిస్తుందన్నారు.